NBK111: నట సింహం బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. #NBK111 గా తెరకెక్కుతున్న సినిమా చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు సమాచారం. బాలకృష్ణ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈక్రమంలో సినిమా టీమ్ ఓ ఆసక్తికరమైన అప్డేట్ పంచుకుంది. ఈ సినిమాలో మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు వెల్లడించింది.
ఈమేరకు విషయాన్ని ధ్రువీకరిస్తూ టీమ్ ఓ పోస్ట్ చేసింది. నేడు మనోజ్ పుట్టినరోజు కూడా కావడంతో విషెష్ చెప్తూ సినిమాలో నటిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేసింది. దీనిపై దర్శకుడు గోపీచంద్ మలినేని ఎక్స్ పోస్ట్ చేస్తూ.. ‘మనోజ్ మా టీమ్ లో జాయిన్ అవుతున్నందుకు సంతోషం. సినిమాలో నీ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉండనుందో ప్రేక్షకులు చూసేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’నని అన్నారు. బాలకృష్ణ-మనోజ్ కాంబినేషన్ రివీల్ కావడంతో సినిమాపై బాలకృష్ణ ఫ్యాన్స్ అంచనాలు పెరిగాయి.
బాలకృష్ణ-మనోజ్ కలిసి గతంలో ఊ.. కొడతారా ఉలిక్కిపడతారా అనే సినిమాలో కలిసి నటించారు. వీరిద్దరి కాంబినేషన్లో ఇది రెండో సినిమా. బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్లో కూడా వీరసింహారెడ్డి తర్వాత ఇది రెండో సినిమా. దీంతో అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. బాలకృష్ణ-నయనతారకు ఇది శ్రీరామరాజ్యం, సింహా, జై సింహా తర్వాత నాలుగో సినిమా. బాలకృష్ణ-తమన్ కాంబినేషన్లో కూడా ఇది ఆరో సినిమా. ఇన్ని కాంబినేషన్లు కలిసి పని చేస్తూండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
