యంగ్ హీరో నిఖిల్ గత చిత్రం ‘అర్జున్ సురవరం’ నిరాశ పర్చింది. అయినా కూడా ఏమాత్రం నిరుత్సాహపడుకుండా వరుసగా చిత్రాలను చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో రెండు సినిమాలున్నాయి. అందులో ముఖ్యంగా కార్తికేయ 2 చిత్రం గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కార్తికేయ మొదటి పార్ట్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు నిఖిల్ కెరీర్ లో అదే పెద్ద హిట్ చిత్రంగా నిలిచింది. ఇలాంటి సమయంలో ఆ సినిమాకు సీక్వెల్ అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
తాజాగా హీరో నిఖిల్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కార్తికేయ 2 చిత్రాన్ని తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా డబ్ చేయబోతున్నట్లుగా పేర్కొన్నాడు. కార్తికేయ 2 చిత్రం యూనివర్శిల్ సబ్జెక్ట్ అని అందుకే తెలుగుతో పాటు హిందీ, తమిళం, తెలుగు, కన్నడం, మలయాళంలో కూడా విడుదల చేయబోతున్నట్లుగా పేర్కొన్నాడు.
ఈమద్య కాలంలో తెలుగు సినిమాలు ఎక్కువగా సౌత్ భాషలన్నింటిలో కూడా విడుదల చేస్తున్నారు. అలాగే హిందీలో కూడా విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు నిఖిల్ కూడా పాన్ ఇండియా అంటూ కార్తికేయ 2 చిత్రంతో రెడీ అవుతున్నాడు.
బాహుబలి తర్వాత తెలుగు సినిమాలకు అక్కడ మంచి క్రేజ్ ఉంది. అందుకే కార్తికేయ 2 చిత్రం కూడా తప్పకుండా హిందీ ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. మరి నిఖిల్ కు ఈ పాన్ ఇండియా మూవీ అయినా సక్సెస్ను తెచ్చి పెడుతుందో చూడాలి.
569616 413852I adore this information presented and possesses given me some type of resolve forpersistance to succeed i really enjoy seeing, so sustain the exceptional function. 574969