మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కెరీర్ రిస్క్ లో ఉందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అనతికాలంలోనే యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించిన విశ్వక్ సేన్ మాస్ కా దాస్ స్క్రీన్ నేమ్ తో అదరగొడుతున్నాడు. ఐతే విశ్వక్ సేన్ సినిమాల కన్నా ఆ సినిమాలకు చేసే ప్రమోషన్స్ తోనే ఎక్కువ వార్తల్లో ఉంటున్నాడు. లాస్ట్ ఇయర్ విశ్వక్ సేన్ గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ అంటూ 3 సినిమాలు చేశాడు. అందులో ఏ ఒక్కటి హిట్ అనిపించుకోలేదు.
గామి విమర్శకుల ప్రశంసలు అందుకోగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో లైట్ తీసుకున్నారు ఆడియన్స్. ఇక మెకానిక్ రాకీ అయితే త్వరగానే షెడ్ కి వెళ్లింది. ఇక రీసెంట్ గా వచ్చిన లైలా ఐతే డిజాస్టర్ అనిపించుకుంది. లైలా రిలీజ్ ముందు జరిగిన కొన్ని విషయాలు కూడా ఆ సినిమా రిజల్ట్ మీద ఎఫెక్ట్ పడేలా చేశాయి.
లైలా రిజల్ట్ తర్వాత విశ్వక్ కెరీర్ మరింత రిస్క్ లో పడిందని చెప్పొచ్చు. యువ హీరో తన మాస్ యాటిట్యూడ్ తో యూత్ ఆడియన్స్ మెప్పు పొందినా కూడా వరుస ఫ్లాపులతో అతని కెరీర్ ట్రాక్ తప్పింది. ఇలానే కొనసాగితే విశ్వక్ తో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు ముందుకు రారని చెప్పొచ్చు. విశ్వక్ సేన్ ఫ్యాన్స్ కూడా మళ్లీ అతను హిట్, ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నుమాదాస్ లాంటి సినిమాలు చేయాలని కోరుతున్నారు. మరి విశ్వక్ సేన్ ఇలా వరుస ఫ్లాపులతో కాకుండా హిట్ టార్గెట్ తో ప్లాన్ చేస్తే బెటర్ అని చెప్పొచ్చు.