రీసెంట్ గా నిర్మాత సింగనమల రమేశ్ చేసిన కామెంట్లు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. ఆయన గతంలో ఖలేజా, కొమరంపులి సినిమాలను నిర్మించారు. ఓ కేసు విషయంలో జైలుకు వెళ్లి వచ్చారు. ఆ కేసులో ఆయన్ను నిర్దోషిగా కోర్టు తేల్చింది. ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలను వెల్లడించారు. సినీ రంగంలో నష్టాల గురించి మాట్లాడుతూ.. అప్పట్లో నేను మహేశ్ బాబుతో ఖలేజా, పవన్ కల్యాణ్ తో కొమరంపులి సినిమాలు తీశాను. అప్పట్లో ఏ సినిమా అయినా ఆరు నెలలు, ఏడాదిలోపే పూర్తయ్యేవి. నా దరిద్రం కొద్ది ఆ రెండు సినిమాలకు మూడేళ్ల టైమ్ పట్టింది.
రూ.100 కోట్ల దాకా నష్టపోయాను. కానీ ఏ ఒక్క హీరో కూడా నాకు ఫోన్ చేసి కనీసం పలకరించలేదు అంటూ అసంతృప్తి తెలిపారు. ఆయన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనం రేపడంతో.. బండ్ల గణేశ్ ట్వీట్ చేసి విమర్శలు గుప్పించారు. సింగనమల రమేష్ మీరు సరిగ్గా సినిమాను ప్లాన్ చేసుకోలేకపోవడం మీ తప్పు. మీ కోసం పవన్ కల్యాణ్ మూడేళ్ల దాకా ఏ సినిమా ఒప్పుకోలేదు. కొన్ని వందల కాల్షీట్లను వేస్ట్ చేసుకున్నారు. అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని.
కాబట్టి ఈ విషయాన్ని రాద్దాంతం చేసుకోకండి. ఇది కరెక్ట్ కాదు అంటూ ఫైర్ అయ్యాడు. బండ్ల గణేశ్ ట్వీట్ ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. పవన్ కల్యాణ్ ఎవరికీ అన్యాయం చేసే వ్యక్తి కాదంటూ ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
