Switch to English

మెగాస్టార్ చిరంజీవిపై బులుగు పచ్చ అసహనం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,470FansLike
57,764FollowersFollow

మెగాస్టార్ చిరంజీవి చేసిన నేరమేంటి.? వైసీపీ అనుకూల మీడియా, టీడీపీ అనుకూల మీడియా.. అదేనండీ, బులుగు మీడియా.. అలాగే పచ్చ మీడియా.. ఎందుకు చిరంజీవి మీద విషం చిమ్ముతున్నట్టు.?

ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభలో చిరంజీవికి అవమానం జరిగిందట. అదెలాంటి అవమానమో ఏమో, ఎవరికీ అర్థం కావడంలేదు. చిరంజీవి, నరేంద్ర మోడీ.. రాజకీయ మంతనాలు చేశారట.. అవెలాంటి మంతనాలో ఎవరికీ అర్థం కావడంలేదు.

బులుగు పచ్చ మీడియా మాత్రం ఎవరికి తోచిన రీతిలో రోత రాతలు రాసేస్తూనే వున్నాయి. మెగాస్టార్ చిరంజీవికి, ప్రత్యేక గౌరవం వైసీపీ ఇచ్చిందట. వైసీపీ ప్రభుత్వం, ప్రత్యేకంగా చిరంజీవిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించిందట. అలాగని వైసీపీ నేత ఒకరు ఓ న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమంలో సెలవిచ్చేశారు.

నిజానికి, భీమవరంలో జరిగిన అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమం పూర్తిగా ప్రైవేటు వ్యవహారం. క్షత్రియ సేవా సమితి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ప్రధానినీ, ముఖ్యమంత్రినీ ఆహ్వానించింది. ఈ క్రమంలో బీజేపీ అనూహ్యంగా ఈ కార్యక్రమాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రంగంలోకి దిగారు. ఇంకోపక్క, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంది. వైసీపీ చేయాల్సినంత హంగామా చేసేసింది.

రాజకీయాలకతీతంగా జరగాల్సిన కార్యక్రమం, రాజకీయ హంగామా నడుమ నడిచింది. వేదిక మీదనే మంత్రి రోజా, ప్రధాని నరేంద్ర మోడీతో సెల్ఫీ కోసం ఆరాటపడటం.. ఈ కార్యక్రమం మీద వైసీపీ సర్కారుకి వున్న చిత్తశుద్ధిని చెప్పకనే చెబుతోంది.

ఇక, చిరంజీవిని ఆహ్వానించింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకంగా చిరంజీవిని ఆహ్వానించిందని చెప్పడానికి రుజువులేమైనా వున్నాయా.? లేవాయె.!

అటు బీజేపీ, ఇటు వైసీపీ.. చిరంజీవి పేరు చెప్పి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నమాట వాస్తవం. దీన్ని టీడీపీ తట్టుకోలేక, తన అనుకూల మీడియా ద్వారా చిరంజీవి మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తోంది. అద్గదీ అసలు సంగతి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

ఎక్కువ చదివినవి

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

రాజమౌళి డైరక్షన్ లో డేవిడ్ వార్నర్.. ఈ క్రేజీ వీడియో చూశారా?

ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్( David Warner) మైదానంలో ఎంత యాక్టివ్గా ఉంటాడో..సోషల్ మీడియాలోనూ అంతే చురుగ్గా ఉంటాడు. ఫేమస్ టాలీవుడ్ పాటలకు తన స్టైల్ లో స్టెప్పులేస్తూ ఆ వీడియోలను అభిమానులతో...

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...