పెట్రోల్ బంకుల దగ్గర చాంతాడంత క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఆయిల్ కంపెనీలకీ, పెట్రోల్ బంకులకీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ సహా, చాలా కాారణాలున్నాయి పెట్రోల్, డీజిల్ కొరతకి సంబంధించి. అమెరికా – ఇరాన్ యుద్ధం నేపథ్యంలో, అంతర్జాతీయ స్థాయిలో చమురు కష్టాలు నెలకొన్నాయి.
పైగా, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ ప్రక్రియ పూర్తవగానే పెట్రో ధరలు గణనీయంగా పెరుగుతాయనీ, ఈసాిర పెట్రోల్ 150 రూపాయల మార్క్‌ని టచ్ చేస్తుందంటూ జాతీయ స్థాయిలో విపక్షాలు, వాటికి అనుకూలంగా పని చేసే మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.
దాంతో, పెట్రోల్ బంకుల వైపు సహజంగానే వాహనదారులు పరుగులు పెడుతున్నాయి. అదనంగా, ఇప్పుడు నడుస్తున్నది వేసవి సీజన్. జనరేటర్లు సహా, పారిశ్రామిక అవసరాల నిమిత్తం డీజిల్ వినియోగం ఎక్కువవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే, కారణాలు చాలానే వున్నాయ్.
పానిక్ ప్రభావంతో, అవసరానికి మించి వాహనదారులు పెట్రోల్ బంకుల వైపు పరుగులు తీస్తున్నారు. పెద్ద పెద్ద టిన్నులతో పెట్రోల్, డీజిల్ నింపుకుంటున్నారు. దాంతో, పెట్రోల్ బంకులూ, ఈ తాకిడిని తట్టుకోలేకపోతున్నాయి. వాస్తవంగా, తెలుగు రాష్ట్రాల్లో వున్న పరిస్థితి ఇది.
సరిగ్గా ఇదే టైమ్ అనుకుని, రాజకీయ రచ్చకు తెరలేపింది వైసీపీ. పెట్రోల్ బంకుల వద్ద వైసీపీ ఆందోళనలు.. అంటూ, ఆ పార్టీ అధినాయకత్వం పిలుపినిచ్చింది. పలువురు వైసీపీ నేతలు, పెట్రోల్ బంకుల వద్దకు వెళ్ళారు ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా.
అయితే, వైసీపీ శ్రేణుల్ని చూసి, వాహనదారులు విసుక్కున్నారు. కారణం, వారి ఆందోళనలతో ట్రాఫిక్ సమస్యలు మరింత పెరగడమే. తెలంగాణలో కూడా పెట్రోల్ బంకుల వద్ద ఇబ్బందికర పరిస్థితులున్న దరిమిలా, వైసీపీ చేస్తున్న నీఛ రాజకీయం బట్టబయలైపోయిందని నెటిజనం కూడా ఏకిపారేస్తున్నారాయె.
విదేశాల్లో వున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తగిన సమాచారం ఇవ్వలేదో, లేదంటే.. ముందూ వెనుకా చూసుకోకుండా పెట్రోల్ బంకుల వద్ద ఆందోళనలకు ఆయనే పిలుపునిచ్చారో.. కారణం ఏదైతేనేం, ఇదొక అట్టర్ ఫ్లాప్ షో అయి కూర్చుంది.
