యాంకర్ శ్యామల కాస్తా ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిథి ఆరె శ్యామలగా మారిపోయిన సంగతి తెలిసిందే.
విశాఖలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, నేను వెళుతున్నాను.. మీరు వస్తున్నారా.? అంటూ ఫలితాల వెల్లడికి కొద్ది రోజుల ముందు మాట్లాడి, సరికొత్త ఐరన్ లెగ్.. అనే ట్యాగ్ వేయించుకున్న ఆరె శ్యామల, మెగాస్టార్ చిరంజీవి మీద కామెంట్లేసి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
కౌంటర్ ఎటాక్ ఖచ్చితంగా వస్తుంది కదా.? గతంలో శ్యామల వ్యాపకాల గురించి నెటిజనం ‘తవ్వి తీసేస్తున్నారు’.. వివరాల్ని బయటపెట్టేస్తున్నారు.
సరే, వ్యక్తిగత దూషణలు ఎవరి మీద అయినా సమర్థనీయం కాదనుకోండి.. అది వేరే సంగతి. అసలు చిరంజీవి ఏమన్నారు.? అన్న విషయమై కనీసపాటి సోయ లేదు ఆరె శ్యామలకి. ‘చిరంజీవిగారు ఏమన్నారో, ఏ ఉద్దేశ్యంతో అన్నారో తెలియదుగానీ..’ అంటూనే, నోటికొచ్చింది వాగేసింది ఆరె శ్యామల.
అద్గదీ అసలు సంగతి. వైసీపీ అధికార ప్రతినిథి అంటే, బేసిక్‌గా బుర్ర అనేది పని చెయ్యకూడదన్న రూల్ వుందేమో.! అందుకే, మీడియా ఏదో అడిగితే, ఏదో వాగెయ్యాలన్న తుత్తర ఆరె శ్యామలకి వుండడం సహజమే. అదే ఆమె కొంప ముంచేసింది.
మినిమమ్ కామన్ సెన్స్‌ని పక్కన పడేస్తేనే, వైసీపీలో పదవులు దక్కుతాయనడానికి ఆరె శ్యామల ఇంకో నిదర్శనం అంతే. చిరంజీవి మీద శ్యామల కామెంట్లేసి రోజులు గడుస్తున్నాయ్.. కానీ, ఆమె కామెంట్లపై ట్రోలింగ్ మాత్రం ఆగడంలేదు. ఎందుకు ఆగుతుంది.? అక్కడికి ఆరె శ్యామల సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ అని వైసీపీ శ్రేణులు అనుకుంటున్నాయేమో.. ఆమె కామెంట్లని వైరల్ చేస్తూనే వున్నాయి. దానికి కౌంటర్ ఎటాక్స్ పడుతున్నాయి.
అన్నట్టు, ఒకప్పుడు వైసీపీలో రోజాని ఐరన్ లెగ్ అనేవాళ్ళు.. ఇప్పుడు ఆ ట్యాగ్ రోజా నుంచి ఆరె శ్యామలకి వచ్చింది.
మేల్ వారసుడు.. అనీ, ఫిమేల్ అయితే వారసురాలు.. అనీ అంటారు.! ‘వారసుడు’ అంటే, అబ్బాయి మాత్రమేనా.? అని అమాయకంగా ఆరె శ్యామల ప్రశ్నించేసిందంటే, ఆమె బుర్ర ఎంత బాగా పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.