Switch to English

వైసీపీ ‘పూల బాట’: రాచరికమా.? ప్రజాస్వామ్యమా.?

తమ అభిమాన నాయకులు కావొచ్చు, తారలు కావొచ్చు.. అలా అలా వెళుతోంటే, వారిపై పూల వర్షం కురిపించడం అన్నది కొందరికి సర్వసాధారణమైన విషయమే.! కానీ, ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి ధాటికి విలవిల్లాడుతున్న వేళ ప్రజా ప్రతినిథులు, ‘రాచరిక పోకడలకు’ దిగితే ఎలా.? ఆంధ్రప్రదేశ్‌లో ఈ చిత్ర విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

అధికార పార్టీ నేతలు, ప్రజలతో ‘పూలబాట’ వేయించుకుంటున్నారు. కరోనా వైరస్‌ ప్రభావిత జిల్లాల్లోనూ ఈ తరహా పరిస్థితులు చోటు చేసుకుంటుండడం గమనార్హం. వైసీపీ ఎమ్మెల్యే రోజా తన నియోజకవర్గంలో తాగు నీటి బోరు ప్రారంభోత్సవానికి వెళ్ళారు. ఈ క్రమంలో ఆమెకు ఘనస్వాగతం లభించింది. ఆమె నడుస్తూ వెళుతోంటే, రోడ్డుపై పూల వర్షం కురిపించారు. అక్కడికి ఆమె మహారాణిలా.. అక్కడున్న జనమంతా ఆమెకు బానిసలుగా.. అన్నట్టు తయారైంది పరిస్థితి.

మామూలు రోజుల్లో అయితే దీన్ని పెద్దగా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాల్సిన ఈ పరిస్థితుల్లో ఈ పూల జల్లు ఏంటి.? అన్నదే ప్రశ్న. పైగా, అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో.. ఈ తతంగాన్ని కష్టంగా భరించాల్సి వచ్చింది ప్రజలకి. ఎమ్మెల్యేగారేమో పూర్తి రక్షణ సాధనాలతో వచ్చారు. కానీ, ప్రజలకు అలాంటి రక్షణ సాధనాలు (మాస్క్‌లు, గ్లోవ్స్‌ వంటివి) మాత్రం లేకపోవడం గమనార్హం.

ఇదే పద్ధతిలో కొద్ది రోజుల క్రితం ఇంకో వైసీపీ ఎమ్మెల్యే (ఈ ఎమ్మెల్యే కూడా మహిళా నేత కావడం గమనార్హం) ఇలాగే పూలబాట వేయించుకున్నారు. చూస్తోంటే, క్రమక్రమంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అటకెక్కి రాచరిక పాలన ముంచుకొస్తోందా.? అన్న అనుమానాలు కలగకమానవు. కరోనా వైరస్‌ పేరుతో వైసీపీ ప్రజా ప్రతినిథులు, స్థానిక ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగించేస్తున్నారు. అంతే తప్ప, వీళ్ళకి జనం మీద అంత శ్రద్ధ వుందని ఎలా అనుకోగలం.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

సినిమా

ప్రభాస్ మూవీతో తెలుగులో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.?...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

రెండోసారి వైరస్.. ప్రమాదకరం కాదా?

ప్రపంచానికి పెను సవాల్ గా పరిణమించిన కరోనా విజృంభణ ఏ మాత్రం తగ్గలేదు. దీని ఉనికి మొదలై ఇప్పటికి ఆరు నెలలు గడిచినా.. ఈ మహమ్మారిని అదుపు చేయడానికి మానవాళి ఇంకా ప్రయత్నాలు...

ఎన్.టి.ఆర్ కాకపోతే వెంకీ – నానిలకి ఫిక్స్ అంటున్న త్రివిక్రమ్.?

కరోనా అనేది లేకుండా ఉంటే, అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇప్పటికి ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఫినిష్ చేసుకొని త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధమయ్యే పనిలో బిజీగా ఉండి ఉంటారు....

గడిపింది బాయ్ ఫ్రెండ్ తో.. గర్భానికి కారణమని డెలివరీ బాయ్ పై కేసు

ఇదో విచిత్రమైన కేసు. చైనాకు చెందిన ఓ ముద్దుగుమ్మ తన బాయ్ ఫ్రెండ్ తో ఏకాంతంగా గడిపింది. ఫలితంగా గర్భం దాల్చింది. అయితే, అందుకు కారణం డెలివరీ బాయ్ అని, అతడు ఎనిమిది...

ఎన్టీఆర్‌ బర్త్‌డే.. నారా లోకేష్‌ రికార్డ్‌.!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజునాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌ సరికొత్త రికార్డులు సృష్టించారు.. అదీ సోషల్‌ మీడియాలో. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు...

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ గిఫ్ట్.. ఎప్పుడైతే అప్పుడే

తన సినిమాల్ని ప్రమోట్ చేసుకోవడంలో రాజమౌళి శైలి వేరు. ప్రమోషన్స్ కు చాలా ప్రాధాన్యతను ఇస్తాడు జక్కన్న. తన హీరోల్ని ప్రోజెక్ట్ చేయడంలో కూడా ముందుంటాడు. బాహుబలికి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అంటూ హైప్...