Switch to English

ఎమ్మెల్సీ కారులో డెడ్ బాడీ.! ఆ వైసీపీ నేత ఎక్కడ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

ఎమ్మెల్సీ కారులో.. సదరు ఎమ్మెల్సీ మాజీ డ్రైవర్ మృతదేహం.! ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదొక వింత. ‘నా భర్తని తీసుకెళ్ళి చంపేసి, శవంగా తీసుకొచ్చి మా ఇంటి ముందు పడేశారు..’ అంటూ మృతుడి భార్య రోదిస్తోంది. ‘అబ్బే, రోడ్డు ప్రమాదంలో చనిపోతే, మానవీయ కోణంలో మృతదేహాన్ని తీసుకొచ్చాం..’ అని ఎమ్మెల్సీ తరఫున కట్టుకథ అత్యద్భుతంగా తెరపైకి తెచ్చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంతే. గుండె పోటు వచ్చి, బాత్రూమ్‌కి వెళ్ళి.. అక్కడ నెత్తుటి వాంతులు చేసేసుకుని, గొడ్డలితో తల నరుక్కుని వైఎస్ వివేకానందరెడ్డి ఎలా చనిపోయారో.. దీనికోసం వైసీపీ అల్లిన కట్టు కథ ఏంటో అందరికీ తెలిసిన వైనమే. ఆ తానులోని గుడ్డ పీలికే.. అన్నట్టు, ఇదిగో ఇక్కడ వైసీపీ ఎమ్మెల్సీ కూడా అలాంటి కట్టుకథే అల్లినట్టున్నారు.

బాధిత కుటుంబానికి విపక్షాల నుంచీ, ప్రజా సంఘాల నుంచీ మద్దతు పెరగడంతో, చేసేది లేక పోలీసులు.. ఎఫ్‌ఐఆర్‌లో వైసీపీ ఎమ్మెల్సీ పేరు కూడా చేర్చారు. ఎమ్మెల్సీ అనంతబాబు మాత్రం విందు, వినోదాలతో ఎంజాయ్ చేస్తున్నారు. వివాహ వేడుకలతో సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మరి, పోలీసులు ఆయన్నెందుకు అరెస్టు చేయడంలేదు.?

ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారట.. ఆయన కోసం వెతుకుతున్నారట. అదేంటీ, ఎమ్మెల్సీ అంటే ఆయనకు భద్రత వుంటుంది కదా.? తద్వారా ఆయన ఆచూకీ తెలుసుకోవడం రెండు నిమిషాల పనే కదా.? అంటే, అదంతే.. ఆంధ్రప్రదేశ్‌లో అంతా అలాగే వుంటుంది.

పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ స్కామ్.. అంటూ మాజీ మంత్రి నారాయణను హైద్రాబాద్‌లో అరెస్టు చేసి, చిత్తూరుకి తరలించి.. బలహీనమైన సెక్షన్లు పెట్టిన ఏపీ పోలీసులకి, వైసీపీ ఎమ్మెల్సీని పట్టుకోవడం చాలా చాలా కష్టమే మరి.! అధికార పార్టీ ఎమ్మెల్సీ కదా, ఆ మాత్రం జాప్యం చేసి, సదరు ఎమ్మెల్సీ తప్పించుకోవడానికి (బెయిల్ కోసం చేసే ప్రయత్నాలకు పరిస్థితులు అనుకూలించేలా చేయడం..) పోలీసులు అవకాశమిస్తున్నారన్నది విపక్షాల ఆరోపణ.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

ఎక్కువ చదివినవి

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...