Switch to English

వైసీపీ భయం: జనసేన 10 కాదు, 20.. ఆ పైన!

91,319FansLike
57,013FollowersFollow

2014 ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికిందనీ, ఆ ఎన్నికల్లో బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసింది కాబట్టి, ఇప్పుడు ఆ పార్టీల మధ్య పొత్తులు లేవు గనుక తమకు అన్ని విధాలా ‘క్లియర్‌ ఎడ్జ్‌’ వుంటుందని ఈసారి ఎన్నికల్లో ‘ల్యాండ్‌ స్లైడ్‌ విక్టరీ’ తమదేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చాలా ధీమాగా వుంది. అయితే, పోలింగ్‌ ముగిసి రోజులు గడుస్తున్న కొద్దీ తెరపైకొస్తున్న విశ్లేషణలు ఇప్పుడిప్పుడే అధికార పార్టీతోపాటు ప్రతిఫక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.? అన్న అంశం చుట్టూ కాకుండా, ఆ పార్టీ ఎంత శాతం ఓటు బ్యాంకుని కొల్లగొడుతుంది.? అనే అంశం చుట్టూనే ప్రధానంగా చర్చ జరుగుతోందిప్పుడు. తెలుగుదేశం పార్టీ అంతర్గత సర్వేలు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత సర్వేలు ఎలా వుంటాయో అందరికీ తెలుసు. ఆయా పార్టీలకు అనుకూలంగానే వుంటాయవి. ఎన్నికల ముందు సర్వేలు మాత్రం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకే అధికారం కట్టబెట్టేశాయి. కానీ, జనసేన ఎఫెక్ట్‌ని ఎన్నికలకు ముందే ఏ జాతీయ జర్వే కూడా పరిగణనలోకి తీసుకోలేదు.

జనసేనదిగా చెప్పబడుతున్న తాజాగా సోషల్‌ మీడియాలో ఓ సర్వే ప్రచారంలో వుంది. అది జనసేన మద్దతుదారుల నుంచి పుట్టుకొచ్చిందనే వాదన విన్పిస్తోంది గనుక, అదెలాగూ జనసేనకే అనుకూలంగా వుంటుంది. అంటే, ఏ సర్వేనీ ఇప్పుడు జనం నమ్మే పరిస్థితి లేదన్నమాట. జనం అయితే ఓట్లు వేసేశారు. తీర్పు, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లలో భద్రంగా వుంది. మే 23న మాత్రమే ఈవీఎంలు ఓపెన్‌ అవుతాయి, అందులో ఆయా పార్టీల బండారం కూడా బయటపడిపోతుంది.

ఇదిలా వుంటే, జనసేన పార్టీకి తొలుత 7 నుంచి 8 శాతం ఓటింగ్‌ వుండొచ్చని అందరూ భావించారు. పోలింగ్‌ తర్వాత దాన్ని 10 నుంచి 12 శాతానికి కొందరు పెంచారు. ఇప్పుడైతే ఆ 12 నుంచి 20 శాతానికి పెంచేస్తూ కొందరు రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టేస్తున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే కొన్ని నియోజకవర్గాల్లో 30 శాతం వరకు జనసేన పార్టీ ఓటు బ్యాంకుని సాధించబోతోందట. అలాంటి నియోజకవర్గాలు 50కి పైనే వున్నాయన్నది ఓ అంచనా.

ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనసేన పార్టీకి కొంత ఎడ్జ్‌ వుండొచ్చు. అలాగని, జనసేన పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయని ఎవరూ విశ్వసించడంలేదు. అదే సమయంలో ఆ పార్టీకి అసలు సీట్లు రావనీ ఎవరూ కుండబద్దలుగొట్టేసే పరిస్థితి లేదు. కర్నూలు జిల్లాలోని మూడు నుంచి ఐదు నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం గట్టిగానే వుండబోతోందట. అది మినహాయిస్తే రాయలసీమలో జనసేన ప్రభావం తక్కువేనని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకుని జనసేన చీల్చుతుందని వైసీపీ నమ్ముతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైసీపీకి వెళ్ళకుండా జనసేన ప్రభావం పనిచేస్తుందని, తద్వారా తమకు లాభం చేకూరుతుందని తెలుగుదేశం పార్టీ గట్టి నమ్మకంతో కన్పిస్తోంది. అయితే, తాజాగా వైసీపీ అంతర్గత సర్వేగా చెప్పబడుతున్న ఓ సర్వేలో 60 నుంచి 80 నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం ఎక్కువగా వుంటుందనీ, వీటిల్లో మళ్ళీ సగానికి పైగా స్థానాల్లో వైసీపీకి జనసేనతో కష్టం పొంచి వుందనీ తేలిందంటూ ఓ విశ్లేషణ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

టీడీపీ, వైసీపీ ఆలోచనలు, అంచనాలతో తమకు పనిలేదనీ, ఎన్నికల్లో జనసేన ఓటు బ్యాంకుపై తమ పార్టీ ఖచ్చితమైన అభిప్రాయంతో వుందనీ, ఎన్నికల తర్వాత జనసేనాని పార్టీ ముఖ్య నేతలతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారనీ, ఖచ్చితంగా జనసేన ప్రభావం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై అంచనాలకు మించి వుండబోతోందనీ జనసేన చెబుతోన్న దరిమిలా, ఆ పార్టీ వాదన ఏమవుతుందో చూడాలిక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారు: వివాదాస్పదమైన రామ్ దేవ్ వ్యాఖ్యలు

ప్రముఖ యోగ గురు రామ్ దేవ్ బాబా మహిళలపై చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి. మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారని అన్నారు. మహారాష్ట్రలోని ఠాణేలో పతంజలి...

కీర్తి భట్‌పై సింపతీ వేవ్.! బిగ్ బాస్ విన్నర్‌ని చేస్తుందా.?

కీర్తి భట్.! బుల్లితెర నటీమణి.! ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్‌లో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు. చేతి వేలికి...

కాంతారా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..! ఓటీటీలో ‘వరాహరూపం’లో ఒరిజినల్ వెర్షన్

సంచలన విజయం సాధించిన ‘కాంతారా’ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా క్లైమాక్స్ లో వచ్చే ‘వరాహరూపం’ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అయితే.. తమ...

మోక్షజ్ఞ ఎంట్రీ షురూ..! సినిమాపై.. దర్శకుడిపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

నందమూరి అభిమానుల ఎదురుచూపులకు తెర దించుతూ నటసింహం బాలకృష్ణ కీలక అనౌన్స్ మెంట్ చేశారు. తనయుడు నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రానికి ముహూర్తం కుదిరిందనే కీలక అప్డేట్...

నటీమణులపై అసభ్యకర పోస్టులు… అనసూయ ఫిర్యాదు… నిందితుడి అరెస్ట్

సినీ నటులు, యాంకర్లు అని తేడా లేకుండా సెలబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్య పదజాలంతో సామజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతోన్న వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు...

రాజకీయం

టీడీపీ ఎమ్మెల్యే గంటా వైసీపీలో చేరబోతున్నారా.?

మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో, సూచనలతో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారట. అసలు గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే వున్నారా.? చాలామందికి వస్తోన్న డౌట్ ఇది. 2019...

ఛాలెంజ్ విసురుతున్నా.. ఈసారి మీరెలా గెలుస్తారో చూస్తా..: పవన్ కల్యాణ్

‘ఎవరికి అన్యాయం జరిగినా స్పందిస్తాం.. మాకు ఓట్లు వేసినా.. వేయకపోయినా అండగా ఉంటాం’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత బాధితులకు...

‘సీకే పల్లి పీఎస్ ముందు పరిటాల సునీత, శ్రీరామ్ బైఠాయింపు..’ పరిస్థితి ఉద్రిక్తత

సత్యసాయి జిల్లా సీకే పల్లి పోలిస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్ధసారధి...

ముఖ్యమంత్రి అజ్ఞానంలో వుంటారు.! జనసేనాని సంచలన వ్యాఖ్యలు.!

‘నేను ఉద్దానం ఎప్పుడు వెళ్ళానో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియకపోవడం శోచనీయం. ఏమీ తెలియకుండానే ఆయన ఏవేవో మాట్లాడేస్తుంటారు నా గురించి. ఆయన అలా అజ్ఞానంలో వుంటారు....

జస్ట్ ఆస్కింగ్: క్రమశిక్షణ అంటే బూతులు తిట్టడమా.?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగు మంచి మాటలు చెప్పారు. ఉన్నత పదవుల్లో వున్నవాళ్ళు మంచి మాటలు చెప్పాలి. వాటిని ప్రజలు ఆచరించేలా చూడాలి. అంతకన్నా...

ఎక్కువ చదివినవి

కెప్టెన్ ఇనాయా.! ఫిజికల్ టాస్క్‌లో అమ్మాయిలదే హవా.!

సాధారణంగా ఫిజికల్ టాస్క్ అనగానే, అమ్మాయిలు - అబ్బాయిల మధ్య రచ్చ జరుగుతుంటుంది. అక్కడ టచ్ చేశావ్.. ఇక్కడ చెయ్యి పెట్టావ్.. అంటూ ఫిమేల్ కంటెస్టెంట్లు నానా యాగీ చేస్తుంటారు. మొదటి సీజన్...

రాశి ఫలాలు: గురువారం 24 నవంబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు మార్గశిర మాసం సూర్యోదయం: ఉ.6:12 సూర్యాస్తమయం: సా.5:25 తిథి: మార్గశిర శుద్ధ పాడ్యమి రా.2:37 వరకు తదుపరి విదియ సంస్కృతవారం: బృహస్పతి వాసరః (గురువారం) నక్షత్రము: అనూరాధ రా.9:23 వరకు తదుపరి...

‘ఫోన్ కాల్ వస్తే డొనేషన్లు కట్టలేదని చెప్పండి.. ప్లీజ్’ తల్లిదండ్రులకు ఫోన్లు

‘మీ అబ్బాయి/అమ్మాయి మా కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఎవరైనా ఫోన్ చేసి డొనేషన్ కట్టారా..? అంటే కట్టలేదని చెప్పండి..’ అని తల్లదండ్రులకు ఓ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. తెలంగాణ మంత్రి...

రాశి ఫలాలు: మంగళవారం 22 నవంబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు కార్తీక మాసం సూర్యోదయం: ఉ.6:12 సూర్యాస్తమయం: సా.5:25 తిథి: కార్తీక బహుళ త్రయోదశి ఉ.6:53 వరకు తదుపరి చతుర్దశి సంస్కృతవారం: భౌమవాసరః (మంగళవారం) నక్షత్రము: స్వాతి రా.11:44 వరకు తదుపరి విశాఖ యోగం:...

‘తోడేలు’ చిత్రం నుండి ‘అంతా ఓకేనా’ వీడియో సాంగ్

"కాంతార" భారీ విజయం తరువాత "గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్" ఇప్పుడు వరుణ్ ధావన్, కృతి సనన్ నటిస్తున్న "భేదియా" చిత్రంతో మరో హారర్-కామెడీ యూనివర్స్‌ సినిమాను తెలుగు ప్రేక్షకులుకు అందించడానికి సిద్దమవుతుంది. తెలుగులో...