Switch to English

వైసీపీ అభిమాని ఓపెన్ లెటర్: జగన్-వీసారె మధ్య చిచ్చు పెడుతున్న టీడీపి మీడియా

బ్రిటిషర్లు భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో అమలు చేసిన వ్యూహం.. విభజించి పాలించడం. భారత్ లోని రాజులందరూ ఒక్కటిగా ఉంటే తమ పప్పులు ఉడకవని భావించి, బ్రిటిషర్లు వ్యూహాత్మకంగా తెరపైకి ఈ విధానాన్ని తీసుకొచ్చి విజయం సాధించారు. ప్రస్తుతం ఇదే తరహాలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డికి మధ్య విభజన రేఖలు తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

ఆంధ్రజ్యోతి అధినేత ఆర్కే ఈ ఆదివారం రాసిన కొత్తపలుకును చదివితే అదే విషయం అర్థమవుతుంది. పరిస్థితులు ఎలాగున్నా.. ప్రపంచమే అల్లకల్లోలం అవుతున్నా ఆయన టార్గెట్ మాత్రం సీఎం జగనే. ప్రతివారం జగన్ నామస్మరణ లేకుండా, ఆయనపై విమర్శలు చేయకుండా కొత్తపలుకు కలం కదలదంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబు ఏది చేసినా మంచి, జగన్ ఏది చేసిన చెడే అన్నరీతిలో ఆయన కథనాలు ఉంటాయి.

ఇక అసలు విషయానికి వస్తే.. తాజా కొత్తపలుకులో విజయసాయిరెడ్డి విశ్వాసంపై ఆర్కే సందేహాలు వెలిబుచ్చారు. గతంలో సుజనా చౌదరి వద్ద అకౌంటెంటుగా పనిచేసిన సాయిరెడ్డి.. ఆయన అప్పట్లో చేసిన అక్రమాలపై ఇప్పుడు పెదవి విప్పారని, ఇది వృత్తిపరమైన అనైతికేనని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పక్కనపెడితే.. ఇప్పుడు సుజనాను బెదిరించడం చూస్తుంటే, భవిష్యత్తులో జగన్ కు కూడా ఇలాంటి పరిస్థితి తప్పదేమోనని ఆ కథనంలో అభిప్రాయపడ్డారు.

తరచి చూస్తే.. ఈ వ్యాఖ్యల వెనుక మర్మం సులభంగానే అర్థమవుతుంది. ప్రస్తుతం విజయసాయిరెడ్డి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నెంబర్ టూగా ఉన్నారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి, జగన్ కు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. నిజానికి విజయసాయిరెడ్డి జగన్ కు పెద్ద అసెట్ అంటూ గతంలో ఆర్కేనే స్వయంగా కొనియాడారు. అలాంటిది తాజాగా ఆయనే జగన్ మనసులో సాయిరెడ్డిపై అనుమానపు బీజాలు నాటాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఉంది.

కానీ ఇక్కడ ఆర్కే ఒక విషయం మరచిపోయినట్టున్నారు. జగన్ ఆస్తుల కేసు విచారణ సందర్భంగా వన్ టూ వన్ విచారణలో జరిగిన విషయాలన్నీ ఆర్కేకి పూస గుచ్చినట్టు తెలిసిపోయేవి. విచారణాధికారి, నిందితుడు మాత్రమే ఉండే గదిలో జరిగిన విషయాలన్నీ యథాతథంగా ఆయన పత్రికలో వచ్చేవి. అందువల్ల అప్పుడు విజయసాయిరెడ్డి ఎలా వ్యవహరించారో ఆర్కేకి తెలియని విషయం అనుకోలేం.

ప్రతిరోజూ సీబీఐ కార్యాలయానికి విచారణ కోసం పిలిపించిన సాయిరెడ్డిని ఉదయం నుంచి రాత్రి వరకు అలాగే కూర్చోబెట్టేవారని, అప్రూవర్ గా మారిపోవాలంటూ ఎంతగానో ఒత్తిడి చేశారని చాలామందికి తెలుసు. కానీ జగన్ వ్యతిరేకులు ఊహించిన సంఘటనలు ఏమీ జరగలేదు. భవిష్యత్తులో అలా జరిగే అవకాశం కూడా లేదు. ఎందుకంటే.. వైఎస్ కుటుంబంతో సాయిరెడ్డి అనుబంధం చాలాకాలంగా ఉంది. పైగా జగన్ సైతం ఆయనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్నింటికీ మించి జగన్ కేసుల్లో సాయిరెడ్డి కూడా నిందితుడే.

అంతేకాకుండా టీడీపీ ఆరోపణలు చేసినట్టుగా లక్షల కోట్ల అక్రమాలు ఏమీ జరగలేదు. సీబీఐ విచారణలో చివరకు తేలిన అక్రమాల విలువ రూ.1500 కోట్ల లోపే. ఆ విషయాన్ని స్వయంగా ఈ కేసు దర్యాప్తు చేసిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణే వెల్లడించారు. అసలు ఈ కేసు నిలిచే అవకాశమే లేదని సాక్షాత్తు ప్రభుత్వ సీఎస్ గా పనిచేసిన రమాకాంత్ రెడ్డి ఎప్పుడో చెప్పారు.

ఒకవేళ నిజంగా అక్రమాలు జరిగి ఉంటే టీడీపీ కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పుడే జగన్ కు శిక్ష వేయించి ఉండగలిగేది. ఇవన్నీ తెలిసి కూడా ఆర్కే ఇప్పుడీ ప్రయత్నం చేయడం వెనుక కారణాలు ఊహించడం చాలా సులభం. సాయిరెడ్డిపై జగన్ లో అనుమానం కలిగిస్తే.. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆయన ప్రాధాన్యత తగ్గుతుందని, తద్వారా ఇద్దరి మధ్య దూరం పెరిగి జగన్ కు వ్యతిరేకంగా గళం విప్పుతారేమోనన్న ఆశ మినహా మరేమీ ఇందులో కనిపించడంలేదు. కానీ అది జరిగే అవకాశం ప్రస్తుతానికైతే లేదు.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

కైలాష్ ఖేర్ ‘మ్యాడ్’ మూవీ పాటకి మంచి స్పంద‌న.!

ప్రస్తుత జనరేషన్ ని ప్రతిబింబించేలా పెళ్లి, సహజీవనంలో ఉన్న రెండు జంటల కథతో రాబోతున్న చిత్రం "మ్యాడ్".ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.ఫ‌స్ట్ లుక్...

ఫ్లాష్ న్యూస్: ఈ విపత్తు సమయంలో చైనా ఎంతటి నీచానికి పాల్పడినదో తెలుసా?

ప్రపంచం మొత్తం కరోనా విలయతాంఢవం చేస్తున్న ఈ సమయంలో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏదో ఒక విధంగా ఇండియాపై దాడి చేస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో చైనా కూడా తమ నీచమైన బుద్దిని...

త్రివిక్రమ్ – వెంకీ – నాని.. మళ్ళీ ఫేకే!

త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురములో చిత్రంతో తిరిగి టాప్ ఫామ్ లోకి వచ్చిన విషయం తెల్సిందే. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తో సినిమాకు కమిటయ్యాడు మాటల మాంత్రికుడు. ఎన్టీఆర్ తో చేసేది...

నిశ్శబ్దం హడావిడి సెన్సార్ వెనుక కారణమేంటి?

నిన్న విడుదలైన ఒక న్యూస్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అదే అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన నిశ్శబ్దం సినిమా సెన్సార్ ను పూర్తి చేసుకుందని, దానికి సెన్సార్...

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం ఏంటో తెలుసా?

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ ఆయన్ను దేశ వ్యాప్తంగా ఆకాశానికి ఎత్తుతున్నారు....