Switch to English

బులుగాట.! చిన్న గాయమైనా పెద్ద కట్టు కట్టాల్సిందే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యేపై దాడి జరిగిందట. ఈ ఘటనలో ఎమ్మెల్యే గాయపడ్డాడట.! దానికి ఓ పెద్ద కట్టు కూడా కట్టేశారు. గాయం చిన్నదైనా కట్టు మాత్రం చాలా పెద్దదే కట్టాలి మరి.! అదే రాజకీయమంటే.

కొన్నాళ్ళ క్రితం.. అంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా వున్న సమయంలో విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఆయన మీద హత్యాయత్నం జరిగింది. ఈ క్రమంలో ఆయన చేతికి చిన్న గాయమైంది. కోడి కత్తితో చేసిన గాయమది. దాడికి పాల్పడ్డట్టుగా చెప్పబడుతున్న ‘కోడి కత్తి శీను’ ఇంకా జైల్లోనే వున్నాడు.

ఏళ్ళు గడుస్తున్నాయ్.! దాడి చేసింది కోడి కత్తి శీను కాదనీ, ఇంకొకరనీ ప్రచారమూ జరుగుతోంది. ఎన్ఐఏ ఈ కేసుని విచారిస్తున్నా, కేసులో పురోగతి కనిపించడంలేదు. హత్యాయత్నం తన మీదే జరిగితే, పొలిటికల్ యాగీ చేసి చేతులు దులుపుకున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అప్పట్లో ఆయన ప్రతిపక్ష నేత. ఇప్పుడేమో ముఖ్యమంత్రి.

‘నా మీద హత్యా యత్నం వెనుక రాజకీయ కుట్ర వుంది..’ అని అప్పట్లో ఆరోపించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఆ రాజకీయ కుట్రని ఛేదించలేకపోయారు. ఆ కోడి కత్తి ఘటనలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భుజానికి గాయమైంది. విశాఖ నుంచి నేరుగా హైద్రాబాద్ వచ్చి, ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరి, వైద్య చికిత్స తీసుకున్నారు.

అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోడి కత్తి గాయానికి చికిత్స చేసిన వైద్య ప్రముఖుడికి, వైఎస్ జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక పదవి కూడా దక్కిందనుకోండి.. అది వేరే సంగతి. మరిప్పుడు, అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేకి గాయమైంది కదా.? చిన్న గాయానికి పెద్ద కట్టు కట్టిన డాక్టరుకి ఎలాంటి పదవి దక్కబోతోంది.?

చిన్న గీత రూపంలో గాయమైంది. దానికేమో చాలా పెద్ద కట్టు కట్టేశారు. అబ్బే, అది గాయం కాదు.. రెడ్ మార్కర్‌తో గీసిన గీత.. అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. కుప్పలు తెప్పలుగా మీమ్స్ పుట్టుకొస్తున్నాయి. దీనికి మళ్ళీ ‘దళిత’ కలరింగ్ ఇచ్చి మరీ రాజకీయం చేస్తోంది అధికార పార్టీ. ఇదీ నేటి రాజకీయం.!

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...