Switch to English

కాంట్రావర్సి సమసిపోయింది- ‘యశోద’ నిర్మాత కృష్ణప్రసాద్

91,245FansLike
57,250FollowersFollow

సమంత టైటిల్ పాత్రలో హరి, హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన సినిమా ‘యశోద’. నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అద్భుతమైన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో ‘ఈవా’ పేరు ఉపయోగించడంతో హైదరాబాద్‌లో ‘ఈవా ఐవీఎఫ్’ ఆసుపత్రి వర్గాలు కోర్టుకు వెళ్ళాయి. వాళ్ళతో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించారు. సినిమాలో ‘ఈవా’ పేరును తొలగించినట్టు పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కావడంతో ‘ఈవా ఐవీఎఫ్’ ఎండీ మోహన్ రావుతో కలిసి మంగళవారం శివలెంక కృష్ణప్రసాద్ విలేఖరుల సమావేశం నిర్వహించారు.

శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ”సమంత ప్రధాన పాత్రలో మేం నిర్మించిన ‘యశోద’ విజయవంతమైన సంగతి తెలిసిందే. సినిమాలో మేం సరోగసీ ఫెసిలిటీ అని చూపించాం. దానికి ‘ఈవా’ అని పేరు పెట్టాం. దానికి మేం ఇచ్చిన నిర్వచనం వేరు. అయితే, హైదరాబాద్ – వరంగల్‌కు చెందిన ‘ఈవా ఐవీఎఫ్’ ఫెర్టిలిటీ ఆసుపత్రి వారు సినిమా అనేది పవర్ ఫుల్ మీడియం కావడంతో… ‘యశోద’లో ఈవా అని చూపించడంతో తమకు ఇబ్బంది కలుగుతుందని కోర్టు ద్వారా న్యాయం కోసం ప్రయత్నించారు. థియేటర్లలో కాకుండా ఓటీటీ వరకు ఆ పేరు వాడకూడదని కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. మాకు ఈ విషయం తెలియదు. ఒకరిని బాధ పెట్టే ఉద్దేశం గానీ, ఇతరుల మనోభావాలను కించపరిచే ఆలోచన గానీ మాకు అసలు లేదు. అందుకని, వెంటనే ‘ఈవా ఐవీఎఫ్’ ఆసుపత్రి వర్గాలను సంప్రదించాను. ‘సినిమా ఇండస్ట్రీ పట్ల మాకు గౌరవం ఉంది. మమ్మల్ని హర్ట్ చేసే విధంగా ఉంది. అందుకని, ఇలా చేశాం’ అని చెప్పారు. ‘ఈవా’ పేరు తీసేస్తామని నేను చెబితే… అప్పుడు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అందుకు గాను మీడియా ముఖంగా ‘ఈవా ఐవీఎఫ్’ యాజమాన్యానికి, ఆసుపత్రి వర్గాలకు కృతజ్ఞతలు చెబుతున్నాను. సినిమాలో ‘ఈవా’ అనేదానిని తొలగించాం. భవిష్యత్తులో ‘యశోద’ సినిమాలో ఎక్కడా ‘ఈవా’ పేరు కనిపించదు. అయితే, థియేటర్లలో సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. థియేటర్లలో పేరు మార్చాలంటే సెన్సార్ ద్వారా జరగాలి. ఆ తర్వాత కేడీఎంలు చేంజ్ చేయాలి. దానికి కొంత టైమ్ పడుతుంది. ఈ విషయం చెబితే… ‘ఈవా ఐవీఎఫ్’ ఆసుపత్రి వర్గాలు అంగీకరించాయి. నేను వాళ్ళ ఆసుపత్రికి వెళ్ళాను. ఆర్గనైజ్డ్ గా చేస్తున్నారు. మంచి సర్వీస్ అందిస్తున్నారు. మాకు ఈ విషయం తెలియక పేరు వాడడంతో చిన్న డిస్టర్బెన్స్ జరిగింది. ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం లభించింది. మేం ఇద్దరం హ్యాపీ” అని చెప్పారు.

‘ఈవా ఐవీఎఫ్’ ఎండీ మోహన్ రావు మాట్లాడుతూ ”కొన్ని రోజుల క్రితం నేను మీడియా ముందుకు వచ్చి ‘యశోద’లో మా ఆసుపత్రి పేరు ఉపయోగించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాను.

ఆ రెండో రోజు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ గారు మమ్మల్ని సంప్రదించారు. కోర్టు ద్వారా మేం వ్యక్తం చేసిన అభ్యంతరాల పట్ల మాతో మాట్లాడారు. ఈవా పేరు తొలగిస్తామని చెప్పారు. మాకు ఇచ్చిన మాట ప్రకారం తొలగించారు కూడా.

నిర్మాతను సంప్రదిస్తే ఇంత త్వరగా పరిష్కారం లభిస్తుందని నాకు తెలియదు. అందుకే, చట్టబద్ధంగా కోర్టుకు వెళ్లాను. సినిమాలో చూపించిన విధంగా విదేశాల్లో జరిగి ఉండొచ్చు. మా దగ్గర ఎలా ఉంటుందనేది ఆసుపత్రికి నిర్మాతను తీసుకువెళ్లి చూపించాం. బయట ఎక్కడా సినిమాలో చూపించినట్టు జరగదు” అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

కృష్ణగారు హంట్ చూసి మెచ్చుకుంటారు అనుకున్నా – సుధీర్ బాబు

నటుడు సుధీర్ బాబు లీడ్ రోల్ లో నటించిన చిత్రం హంట్. ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా...

ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’.. సినీ ప్రముఖుల అభినందన

భారతీయ సినీ ప్రేమికుల ఆశలకు అనుగుణంగా 95వ ఆస్కార్ నామినేషన్స్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ ఎంపికైంది. కాలిఫోర్నియాలో జరిగిన కార్యక్రమంలో ది...

’24 గంటల్లో క్షమాపణ చెప్పాలి..’ బాలకృష్ణ, టీడీపీకి కాపునాడు అల్టిమేటం..

వీరసింహారెడ్డి సినిమా విజయోత్సవ వేడుకలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తెలుగు సినిమా మహానటులు ఎస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వరరావులను ఉద్దేశించి.. ‘ఆ...

సూటిగా.. స్పష్టంగా..! బాలకృష్ణకు అక్కినేని నాగ చైతన్య, అఖిల్ కౌంటర్..

వీరసింహారెడ్డి సినిమా విజయోత్సవ సభలో మహానటులు ఎస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వరరావులపై పరోక్షంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ‘ఆ...

వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్.! ఆ దమ్మెవరికైనా వుందా.?

ఆరు పదుల వయసులో బాక్సాఫీస్ వద్ద రెండొందల కోట్ల రికార్డ్ నెలకొల్పడం తెలుగు సినీ పరిశ్రమలో ఇంకెవరికైనా సాధ్యమా.? తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి వన్...

రాజకీయం

అదిగదిగో జనసేనాని ‘వారాహి’.! ఏపీలో ఆపేదెవరు.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ‘వారాహి’ వాహనం అడుగు పెట్టబోతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ పర్యటనల కోసమే ప్రత్యేకంగా తయారు చేయబడ్డ ‘వారాహి’ వాహనానికి తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు...

’24 గంటల్లో క్షమాపణ చెప్పాలి..’ బాలకృష్ణ, టీడీపీకి కాపునాడు అల్టిమేటం..

వీరసింహారెడ్డి సినిమా విజయోత్సవ వేడుకలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తెలుగు సినిమా మహానటులు ఎస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వరరావులను ఉద్దేశించి.. ‘ఆ రంగారావు.. అక్కినేని.. తొక్కినేని’ అనే వ్యాఖ్యలు...

‘అమ్మో’రికా.! జర జాగ్రత్త కుర్రాళ్ళూ.!

అమెరికా.. ఇది చాలామందికి కలల ప్రపంచం.! ఔను, జీవితంలో స్థిరపడాలంటే, అమెరికా వెళ్ళాల్సిందే.. అనుకుంటోంది నేటి యువత.! ఉన్నత చదువుల కోసం కావొచ్చు.. ఉన్నతమైన ఉద్యోగం కోసం కావొచ్చు.. అమెరికా వైపే నేటి...

జనసేనాని పవన్ కళ్యాణ్ ‘వారాహి’.! ఎందుకంత ప్రత్యేకం.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పర్యటనల నిమిత్తం ‘వారాహి’ అనే వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. పాదయాత్రలకు ఎలా పేర్లు పెడుతుంటారో, రాజకీయ నాయకులు తమ ప్రచార వాహనాలకి కూడా పేర్లు...

పులివెందులకు సీబీఐ..! విచారణకు రావాలని ఎంపీ అవినాశ్ కు నోటీసులు

మాజీ మంత్రి, ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. ఈక్రమంలో విచారణలో భాగంగా వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు...

ఎక్కువ చదివినవి

పులివెందులకు సీబీఐ..! విచారణకు రావాలని ఎంపీ అవినాశ్ కు నోటీసులు

మాజీ మంత్రి, ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. ఈక్రమంలో విచారణలో భాగంగా వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు...

మమ్మల్ని పోత్సహిస్తున్న ప్రేక్షక దేవుళ్లుందరికీ కృతజ్ఞతలు: నందమూరి బాలకృష్ణ

గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మాసియస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'వీరసింహారెడ్డి' వీరమాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది....

మ్యాన్షన్ హౌస్ ఎఫెక్ట్.! ఏంటి బాలయ్యా మరీనూ.!

పొద్దున్నే చుట్ట కాల్చడం నాకు అలవాటు.. అది ఆరోగ్యానికి చాలా మంచిది. లంగ్స్‌లో పేరుకుపోయిన చెత్తని బయటకు లాగేస్తుంది.! ఔను, నందమూరి బాలకృష్ణ వున్నపళంగా ‘లంగ్స్’ స్పెషలిస్ట్ అయిపోయాడాయె.! డాక్టర్ బాలకృష్ణ చెప్పారు కాబట్టి,...

2021లో భారతదేశం ఎంత దేశం బంగారం కొనుగోలు చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!

భారతదేశానికి, బంగారానికి విడదీయరాని బంధం ఉంది. ముఖ్యంగా మహిళలు బంగారాన్ని తమలో ఒక భాగంగా చూస్తారు. బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ లో భాగంగా చూస్తారు. ఇక 2021లో భారతదేశం మొత్తం ఎంత బంగారం కొనుగోలు...

మూత్ర విసర్జన ఘటనపై డీజీసీఏ చర్యలు.. ఎయిరిండియాకు భారీ జరిమానా

విమానంలో మహిళపై మూత్ర విసర్జన ఘటనలో ఎయిరిండియాపై డీజీసీఏ (DGCA) తీవ్ర చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఎయిరిండియాకు రూ.30లక్షల జరిమానా విధించింది. ఘటన జరిగిన న్యూయార్క్-ఢిల్లీ విమాన పైలట్ లైసెన్స్ మూడు...