Yash: భార్యను సంతోషం కోసం భర్తలు దేశాలు తిప్పక్కర్లేదు.. ఖరీదైన వస్తువులు కొనక్కర్లేదు.. ప్రేమతో చాక్లెల్స్ కొనిచ్చినా చాలని నిరూపించాడు కన్నడ స్టార్ హీరో యశ్ (Yash). భార్య కోసం బజార్లో చిన్న స్టాల్ కు వెళ్లి ఐస్ క్యాండీ, చాక్లెట్స్ కొంటున్న యశ్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటకలోని భత్కల్ జిల్లాలోని షిరాలికి కుటుంబంతో వెళ్లిన యశ్ అక్కడి చిత్రపుర మఠాన్ని సందర్శించాడు. ఈక్రమంలో భార్య అడిగిందని అక్కడే ఉన్న స్టాల్ కి వెళ్లి సాధారణ పౌరుడిలా ఐస్ క్యాండీ, చాక్లెట్స్ కొన్నాడు. యశ్ ను చూస్తూ పక్కనే అతని భార్య మురిపెంగా చూస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.
స్టార్ హీరో.. ఫైవ్ స్టార్ హోటల్స్.. కోరుకున్నది దగ్గరకి తెప్పించుకోగలిగి కూడా ఇంత సింపుల్ గా స్టోర్ కి వెళ్లడం సూపర్ అంటూ ఆయన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కేజీఎఫ్ తో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న యశ్ ప్రస్తుతం ‘టాక్సిక్’లో నటిస్తున్నారు.