Switch to English

పచ్చ పైశాచికానందం.. అందుకే జనసేనపై దుష్ప్రచారం.!

తాను నాశనమైపోతూ, ఇతరుల్ని నాశనం చేయడం ద్వారా పైశాచికానందం పొందుతుంటారు కొందరు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిది భస్మాసురహస్తం.. అనేది ఇందుకే. ఏ పార్టీతో అంట కాగితే ఆ పార్టీని నాశనం చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య.. అంటారు రాజకీయ పరిశీలకులు. వామపక్షాలు చంద్రబాబు కారణంగానే నాశనమైపోయాయ్ తెలుగునాట.

2014 ఎన్నికల్లో తమకు స్నేహ హస్తం అందించిన బీజేపీనీ, జనసేననీ చంద్రబాబు దారుణంగా దెబ్బకొట్టారు. చివరికి కాంగ్రెస్ పార్టీతో చెట్టాపట్టాలేసుకు తిరిగి, ఆ పార్టీని కూడా దెబ్బతీశారు. చంద్రబాబుకి ఎవరు స్నేహ హస్తం అందిస్తే, వాళ్ళు రాజకీయంగా గల్లంతైపోవడమేనన్న భావన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంటుంది.

వ్యూహాత్మక వైఫల్యాలు ఎన్ని కనిపిస్తున్నా, చంద్రబాబు మాత్రం ఇంకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే వుంటారు. ఎందుకంటే, తనకు వంత పాడే మీడియా వుంటుంది గనుక. టీడీపీకి ఎవరు రాజకీయ ప్రత్యర్థులైతే వారి మీద బురద చల్లడమే సోకాల్డ్ యెల్లో మీడియా పని. ఇప్పుడు జనసేన మీద సదరు యెల్లో మీడియా దుష్ప్రచారం వెనుక చంద్రబాబు అండ్ టీమ్ కుట్ర సుస్పష్టం.

2019 ఎన్నికల్లో టీడీపీ – వైసీపీల మీద విరుచుకుపడుతూ జనసేన అధినేత జోరుగా ప్రచారం చేస్తున్న సమయంలో, ‘పవన్ కల్యాణ్ మావాడే..’ అంటూ టీడీపీ నేతలు దుష్ప్రచారం షురూ చేశారు. దాన్ని పట్టుకుని, జనసేనను బదనాం చేసి రాజకీయంగా లాభపడింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ టీడీపీ వ్యూహాలు సుస్పస్టం. తమకు రాజకీయ ప్రత్యర్థిగా వైసీపీ వుండొచ్చుగానీ, జనసేన మాత్రం అసలు రాజకీయాల్లోనే వుండకూడదన్నట్టు వ్యవహరిస్తుంటుంది టీడీపీ.

ఇప్పుడూ అదే జరుగుతోంది. టీడీపీ పూర్తిస్థాయిలో నిర్వీర్యమైపోయింది. నేతలకు, కార్యకర్తలకు అధినేత మీద నమ్మకం పోయింది. క్యాడర్ చెల్లాచెదురైపోయింది. సమీప భవిష్యత్తులో టీడీపీ పుంజుకునే అవకాశాల్లేవు. నిజానికి, ఇలాంటి తరుణంలో టీడీపీని బాగుచేసేందుకు చంద్రబాబు ప్రయత్నించాలి. కానీ, జనసేనను బదనాం చేసేందుకు యెల్లో మీడియాని అడ్డంపెట్టుకుని నీఛ రాజకీయం చేస్తున్నారన్నది నిర్వివాదాంశం.

చిత్రమేంటంటో యెల్లో మీడియా కూడా చంద్రబాబుకి మేలు చేయడం గురించి ఆలోచించడం మానేసి, చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థుల్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోంది. యధా చంద్రబాబు, తథా యెల్లో మీడియా. జనసేన నుంచి ఎంత ఛీత్కారాలు ఎదురవుతున్నా, టీడీపీ నుంచి జనసేనతో పొత్తు.. అంటూ ప్రేలాపనలు వినిపిస్తున్నాయంటే.. ఇది జనసేనను దెబ్బకొట్టే వ్యూహం తప్ప, టీడీపీ బాగుపడే వ్యూహం కానే కాదు.

ఈ రాజకీయ పైశాచికత్వం కంటే, వైసీపీతో టీడీపీ అంటకాగితే కాస్తయినా ప్రయోజనం వుంటుందేమో.. ‘ఏమో’ కాదు, జనసేనను తొక్కేసేందుకు వైసీపీతో కలిసి టీడీపీ ఆడుతున్న డ్రామాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

కంగనాను హడలెత్తించిన రైతులు

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్ కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై విమర్శలు చేసిన విషయం తెల్సిందే. ఆమె పూర్తి స్థాయిలో...

థియేటర్లపై ఆంక్షలు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి

తెలుగు రాష్ట్రాల్లో మెల్ల మెల్లగా సినిమాల హడావుడి మొదలు అయ్యింది.. థియేటర్ల వద్ద పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈ సమయంలో కరోనా థర్డ్‌ వేవ్‌ అంటూ...

వీడియో : పుష్ప ట్రైలర్ టీజ్‌

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు...

బిగ్ బాస్ లీక్ : టికెట్‌ టు ఫినాలే దక్కింది అతడికే

తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 5 నుండి మరో లీక్ వచ్చింది. సీజన్ ఆరంభం నుండి లీక్ ల జాతర కొనసాగుతూనే ఉంది. తాజాగా కీలకమైన...

అన్ స్టాపబుల్: బాబాయ్ – అబ్బాయ్ మాస్ జాతర

ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న టాక్ షో అన్ స్టాపబుల్. ఈ షో నుండి ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ వచ్చాయి. మోహన్ బాబు, నాని...

రాజకీయం

మూడు రాజధానులపై ‘మోజు’ తీరలేదింకా.!

నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరు.. మూడు రాజధానుల విషయంలో. రాజధాని సంగతి దేవుడెరుగు.. కనీసం, రాష్ట్రంలో రోడ్లకు పడ్డ గుంతల్ని బాగు చేయలేని దుస్థితి ఓ వైపు...

పోలవరం రగడ: నోటి పారుదల కాదు మహాప్రభో.!

ఓ బులుగు ఎమ్మెల్యేకి పోలవరం ప్రాజెక్టు ఏ నది మీద కట్టారో కూడా తెలియదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు.. వాటి దిగువన పోలవరం ప్రాజెక్టు.. అంటూ, గోదావరి నది మీద...

పార్లమెంటు సాక్షిగా రాష్ట్రం పరువు తీసేసిన వైసీపీ ఎంపీలు.!

‘మా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోంది మొర్రో..’ అంటున్నారు ఓ ఎంపీ.. ‘ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టమైపోతోంది మహాప్రభో..’ అంటూ వాపోయారో మరో ఎంపీ.. ‘బ్యాంకుల్ని ముంచేశారు..’ అంటూ తమ పార్టీకి చెందిన ఎంపీ...

సిరివెన్నెలపై జగన్ పెద్ద మనసు.! సొంత సొమ్ములిచ్చారా.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా పెద్ద మనసు చేసుకున్నారు. ప్రముఖ సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో ఇటీవల తుది శ్వాస విడువగా, ఆయనకు ఆసుపత్రిలో వైద్య చికిత్స కోసం...

ఆంధ్రప్రదేశ్‌పై నీతి అయోగ్ ప్రశంసలట.. నమ్మేద్దామా.?

నీతి అయోగ్, ఆంధ్రప్రదేశ్ మీద ప్రశంసలు గుప్పించేసింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలన అత్యద్భుతంగా వుందంటూ కితాబులిచ్చేసింది. గ్రామాలు అద్భుతంగా అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయట. సంక్షేమ పథకాల అమలు అద్భుతంగా వుందట. రైతు...

ఎక్కువ చదివినవి

తుది శ్వాస విడిచిన లెజండరీ రచయిత సిరివెన్నెల

ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు. కొద్దిసేపటి క్రితం ఆయన తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా ఆయన గత కొన్ని రోజులుగా హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నవంబర్ 24న...

బిగ్ బాస్ 5: టికెట్ టు ఫినాలే గెలుచుకునేది ఎవరు?

బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంటోంది. ఇంకా ఫైనల్ వీక్ కు రెండు వారాలు మాత్రమే ఉన్నాయి. నిన్న నామినేషన్స్ ఎపిపోడ్ ఎంత వాడివేడిగా సాగిందో అందరం చూసాం. ఈ...

అన్ స్టాపబుల్: బాబాయ్ – అబ్బాయ్ మాస్ జాతర

ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న టాక్ షో అన్ స్టాపబుల్. ఈ షో నుండి ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ వచ్చాయి. మోహన్ బాబు, నాని చీఫ్ గెస్ట్స్ గా విచ్చేసారు. మూడో...

బిగ్ బాస్ 5: ఆ నలుగురిలో టికెట్ టు ఫినాలే ఎవరికి?

బిగ్ బాస్ సీజన్ లో అతి ముఖ్యమైన ఘట్టమైన టికెట్ టు ఫినాలే ఇంకా కొనసాగుతోంది. కొంత మంది ప్లేయర్స్ కు గాయాలవడంతో టాస్క్ లను కొంత ఆలస్యంగా నిర్వహిస్తూ వస్తున్నారు. మొన్నటి...

రాశి ఫలాలు:సోమవారం 29 నవంబర్ 2021

పంచాంగం శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ఋతువు కార్తీక మాసం కృష్ణపక్షం సూర్యోదయం: ఉ.6:12 సూర్యాస్తమయం : సా‌.5:20 తిథి: కార్తీక బహుళ దశమి రా.11:19 నిమిషముల వరకు తదుపరి కార్తీక బహుళ ఏకాదశి సంస్కృతవారం: ఇందువాసరః (సోమవారం) నక్షత్రము: ఉత్తర...