కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ రైటర్ పద్మభూషణ్. షణ్ముఖ ప్రశాంత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం డీసెంట్ బజ్ క్రియేట్ చేసింది. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమాను చాలా అగ్రెసివ్ గా ప్రమోట్ చేసారు నిర్మాతలు. మరి ఆ హైప్ ను రైటర్ పద్మభూషణ్ నిలబెట్టుకుందా?
కథ:
పద్మభూషణ్ (సుహాస్) పెద్ద రైటర్ అవ్వాలని కలలుకంటుంటాడు. విజయవాడలో తన తల్లిదండ్రులు (రోహిణి, ఆశిష్ విద్యార్థి)లతో కలిసి ఉంటాడు. ఇదిలా ఉండగా సారిక (టీనా)తో భూషణ్ కు పెళ్లి నిశ్చయమవుతుంది. సారిక తండ్రి భూషణ్ పేరు మీద ఉన్న పుస్తకాన్ని చూసి ఇంప్రెస్ అవుతాడు. వాళ్ళు భూషణ్ పెద్ద రైటర్ అని ఫీల్ అవుతుంటారు.
అసలు నిజం ఏంటంటే భూషణ్ ఆ పుస్తకాన్ని రాయడు. మరి ఇంతకీ ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు? నిజం బయట పడిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి?
నటీనటులు:
సుహాస్ మరోసారి తాను ఎంత మంచి నటుడు అన్నది నిరూపించాడు. ఈసారి మరింత కామెడీ, మరింత ఎమోషనల్ రోల్ లో మెప్పించాడు. తన కామెడీ టైమింగ్ పీక్స్ అని చెప్పాలి. రోహిణికి మరోసారి చాలా మంచి పాత్ర దక్కింది. చివర్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన సూపర్బ్. అలాగే ఆశిష్ విద్యార్థి కూడా చాలా కాలం తర్వాత మంచి రోల్ చేసాడు.
టీనాకు కూడా చాలా ప్రాధాన్యమున్న పాత్ర దక్కింది. అయితే కొన్ని సీన్స్ లో మెప్పించిన టీనా కొన్ని సీన్స్ లో బ్లాంక్ గా అనిపించింది. ఆమె తన బాడీ లాంగ్వేజ్ మీద వర్క్ చేయాల్సి ఉంది. కీలకమైన టైమ్ లో ఎంట్రీ ఇచ్చే గౌరీప్రియ అంతలా మెప్పించదు. హీరో ఫ్రెండ్ గా చేసిన ప్రవీణ్ కూడా యావరేజ్ గా అనిపిస్తాడు.
సాంకేతిక నిపుణులు:
షణ్ముఖ ప్రశాంత్ కథ సూపర్బ్. చివర్లో ఇవ్వాలనుకున్న మెసేజ్ కచ్చితంగా రిలేటబుల్ అనిపిస్తుంది. చాలా కుటుంబాలు ఈ కథకు కనెక్ట్ అవుతాయి. స్క్రీన్ ప్లే బాగుంది. చిత్రంలో కొన్ని మంచి ట్విస్ట్ లు ఉన్నాయి. అయితే వాటిని కథలోకి తీసుకొచ్చే క్రమంపై మరికొంత వర్క్ చేయాల్సింది. మొత్తంగా మొదటి చిత్రంతో షణ్ముఖ ప్రశాంత్ మెప్పిస్తాడు. నరేషన్ లో చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నా కానీ చివరి 20 నిమిషాల తర్వాత వాటిని క్షమించేయొచ్చు.
వెంకట్ ఆర్ శాఖమూరి కెమెరా పనితనం బాగుంది. విజయవాడను బెస్ట్ గా చూపించాడని చెప్పవచ్చు. శేఖర్ చంద్ర, కళ్యాణ్ నాయక్ సంగీతం ఇంప్రెస్ చేస్తుంది. కన్నుల్లో నీ రూపమే తో పాటు అయ్యబాబోయ్ గందరగోళం సాంగ్ కూడా నచ్చుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతే. ఎడిటింగ్ నీట్ గా సాగింది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
- ఎమోషనల్ గా సాగే చివరి 20 నిముషాలు
- క్లైమాక్స్
- సుహాస్, రోహిణి పెర్ఫార్మన్స్ లు
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్
- కామెడీ
మైనస్ పాయింట్స్:
- ఇద్దరు హీరోయిన్ల పెర్ఫార్మన్స్ లు
- స్క్రీన్ ప్లే ఇంకా బిగి ఉండవచ్చు
- కొన్ని చోట్ల నరేషన్
విశ్లేషణ:
మొత్తంగా చూసుకుంటే రైటర్ పద్మభూషణ్ ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కామెడీగా మొదలైన ఈ చిత్రం చివర్లో ఎమోషనల్ నోట్ తో రిలేటబుల్ మెసేజ్ తో సాగింది. మీ తల్లిదండ్రులతో ఈ సినిమా చూడండి!
తెలుగు బులెటిన్.కామ్ రేటింగ్: 2.75/5
851523 52275You ought to participate in a contest for probably the greatest blogs on the web. I will recommend this internet internet site! 882078
666897 176156Its really a cool and useful piece of info. Im glad which you shared this useful info with us. Please maintain us informed like this. Thanks for sharing. 389176
48237 76125Audio began playing as soon as I opened this blog, so frustrating! 870557