7 wonders: ప్రపంచంలోని ఏడు వింతలను అతి తక్కువ సమయంలో సందర్శించి గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు ఈజిప్టుకు చెందిన మాగ్దే ఐసా (Magdy Eissa). ప్రస్తుతం ఇతడి సాహసగాధ వార్తల్లో నిలిచింది. గతంలో ఇంగ్లాండుకు చెందిన జేమీ మెక్ డొనాల్డ్ 6రోజుల 17గంటల్లో చేసిన ఈ సాహసయాత్రను మాగ్దే.. 6రోజుల 11గంటల 52నిముషాల్లో (4గంటలు వేగంగా) పూర్తి చేసి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీనిని గిన్నీస్ బుక్ గుర్తించి తన ఇన్ స్టాలో షేర్ చేసింది.
మాగ్దే తన యాత్రను చైనాలోని గ్రేట్ వాల్ ఆఫ్ చైనాతో మొదలుపెట్టి ఆగ్రాలోని తాజ్ మహల్, జోర్డాన్ లోని పురాతన నగరం పెట్రా, ఇటలీలోని రోమ్ కొలీజియం, బ్రెజిల్ లోని క్రీస్ట్ ఆఫ్ రిడీమర్, పెరులోని మచుపిచు, మెక్సికోలోని షింషెన్ ఇట్జా పురాతన నగరాన్ని సందర్శించి యాత్రను పూర్తి చేశారు. యాత్ర మొత్తం ఎక్కడా ప్రైవేటు వాహనాలు ఉపయోగించకుండా కేవలం ప్రజా రవాణాల్లోనే ప్రయాణించడం విశేషం. యాత్రను ప్లాన్ చేసుకునేందుకు ఏడాదిన్నర సమయం పట్టిందని మాగ్దే చెప్పుకొచ్చారు.
View this post on Instagram