Switch to English

వరల్డ్‌ కప్‌ ఎఫెక్ట్‌: ధోనీతోపాటు, కోహ్లీపైనా వేటు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

టీమిండియా వరల్డ్‌ కప్‌ని చేజార్చుకోవడం వెనుక నేరం ఎవరిది.? అంటే, ముందుగా వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ దోనీ పేరునే సూచిస్తున్నారు చాలామంది. ఆ తర్వాతి పేరు ఖచ్చితంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీదేనన్నది మెజార్టీ అభిప్రాయం. మూడో నిందితులుగా సెలక్టర్లను ఇక్కడ ప్రస్తావించాలి. బీసీసీఐ తప్పిదాన్నీ కాదనలేమిక్కడ. చేతికి అందివచ్చిన ప్రపంచ కప్‌ని చేజార్చుకోవడమంటే అది అత్యంత బాధాకరమైన విషయం. టీమ్‌ పెర్ఫామెన్స్‌ సరిగ్గా లేక, కప్పుకి దూరమైతే అది వేరే విషయం. ‘పోరాడాం, ఓడిపోయాం..’ అంటే, అది మరో రకం.

కానీ, చేవ వుండి.. చేతకాక ప్రపంచ కప్‌ని టీమిండియా వదిలేసుకుంది. కాదు కాదు, ప్రత్యర్థి చేతిలో ప్రపంచ కప్‌ని పెట్టి, నిస్సిగ్గుగా టీమిండియా తిరిగొచ్చిందని భారత క్రికెట్‌ అభిమానుల్లో ఓ వర్గం బలంగా భావిస్తోంది. మాజీ క్రికెటర్లూ ఇదే విషయాన్ని కుండబద్దలుగొట్టేస్తున్నారు. క్రికెటర్‌గా మహేంద్ర సింగ్‌ ధోనీ, భారత క్రికెట్‌లోనే కాదు, ప్రపంచ క్రికెట్‌లోనే ఓ అద్భుతం. విరాట్‌ కోహ్లీ ప్రతిభ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ, ప్రతిభ వేరు.. అవసరమైన సందర్భంలో సమయోచితంగా వ్యవహరించి, జట్టుని విజయ పథాన నడపడం వేరు.

గెలుపోటముల సమస్య కాదిక్కడ. పాకిస్తాన్‌కి ఛాంపియన్స్‌ ట్రోఫీని టీమిండియానే అప్పగించి వచ్చేసింది. అప్పట్లో కోచ్‌ కుంబ్లేతో వివాదాల కారణంగా కెప్టెన్‌ కోహ్లీ ప్రదర్శించిన పైత్యం తాలూకు ప్రతిఫలమది. ఇక్కడ, బ్యాటింగ్‌ లైనప్‌లో నాలుగో పొజిషన్‌ విషయమై కెప్టెన్‌ కోహ్లీ, సెలక్టర్ల అత్యుత్సాహం, అవసరం లేని ప్రయోగాలు తెచ్చిన ముప్పు కారణంగానే టీమిండియా వరల్డ్‌ కప్‌ని కోల్పోయిందన్నది నిర్వివాదాంశం.

ప్రపంచ క్రికెట్‌లోనే బెస్ట్‌ మ్యాచ్‌ ఫినిషర్‌ అన్పించుకున్న ధోనీ, ఈ వరల్డ్‌ కప్‌లో చేసిన పరుగులు, అందుకోసం అతను వాడుకున్న బంతుల్ని పరిశీలిస్తే, ఎక్కడో ధోనీలో అసంతృప్తి కన్పించకమానదు. ఆ అసంతృప్తి కారణంగానే, అతని ఆటతీరు అంతలా మందగించేసింది. జట్టు ప్రయోజనాల్ని కాదని, ధోనీ ‘జిడ్డు’ ఆట ఆడాడన్నది మెజార్టీ అభిప్రాయం. ఇలా సవాలక్ష విశ్లేషణల నేపథ్యంలో వన్డేల నుంచి కోహ్లీని కెప్టెన్‌గా తొలగించాలనే ఆలోచన చేస్తోంది బీసీసీఐ.

గౌరవప్రదంగా ధోనీ కూడా క్రికెట్‌కి గుడ్‌ బై చెబితే మంచిదని ఆల్రెడీ బీసీసీఐ నుంచి, మహేంద్ర సింగ్‌ ధోనీకి సమాచారం కూడా అందిందట. పరోక్షంగా ఇది ఈ ఇద్దరు మేటి క్రికెటర్లపైనా ‘వేటు’ అనే భావించాల్సి వుంటుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...