కమర్షియల్ సినిమాల పేరుతో మహిళలను కించ పరుస్తున్న ఫిల్మ్ మేకర్స్‌పై తెలంగాణ రాష్ట్ర మహిళ కమీషన్ అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల కొన్ని తెలుగు సినిమాల్లోని పాటల్లో వేస్తున్న స్టెప్స్ అసభ్యకరంగా ఉన్నాయని, ఆడవారిని కించ పరిచే విధంగా ఉన్నాయని మహిళ కమీషన్‌కి ఫిర్యాదులు అందాయట. దాంతో మహిళ కమీషన్ ఆ విషయమై తీవ్రంగా స్పందించింది.
సినిమా అనేది సమాజంపై ఎక్కువ ప్రభావం చూపించే మాధ్యమం. కనుక సినిమాల్లో మహిళలను అవమానించేలా, అసభ్యకరంగా మహిళలను చూపించే విధంగా సీన్స్, పాటలు ఉండవద్దని మహిళ కమీషన్ సూచించింది. మహిళలను అవమానించినట్లు ఉన్న పాటల విషయంలో మహిళ కమీషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
సినిమాల్లో మహిళలను చూపించే సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మహిళా కమీషన్ ఫిల్మ్ మేకర్స్‌కి సున్నితంగా హెచ్చరించింది. మహిళలను కించ పరిచే విధంగా డాన్స్ స్టెప్స్‌ను ఉపయోగించకూడదు అని మహిళా కమీషన్ సూచించింది. ఇకపై ఈ హెచ్చరికను పాటించకుంటే ఆయా ఫిల్మ్ మేకర్స్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు.
మహిళలను గౌరవించడం నైతిక బాధ్యతగా తీసుకుని సినిమాల్లో పాటలు, సీన్స్‌ను రూపకల్పన చేయాలంటూ ఇండస్ట్రీకి మహిళ కమీషన్ సూచించింది. ఇకపై మహిళలను అవమానించే విధంగా సీన్స్ ఉండవని ఆశిస్తున్నాం అంటూ మహిళ కమీషన్ నుంచి ప్రకటన విడుదలైంది. ఈ విషయమై ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.