డైరెక్టర్ త్రినాథరావు నక్కిన వివాదంలో చిక్కుకున్నారు. మజాకా సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ అన్షుపై చేసిన అనుచిత కామెంట్స్ పెద్ద దుమారమే రేపుతున్నాయి. డైరెక్టర్ ను ఏకి పారేస్తున్నాయి మహిళా సంఘాలు. సగటు సినిమా ప్రేక్షకులు కూడా ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఆయన మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ మహిళా కమిషన్ కూడా సీరియస్ గా రియాక్ట్ అయింది. ఆడవారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుండటాన్ని అస్సలు సహించేది లేదని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ళ శారదా తెలిపారు.
ఆయన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుంటున్నామని ఆమె చెప్పారు. త్వరలోనే త్రినాథరావుకు నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. మాజాకా టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన మాట్లాడుతూ హీరోయిన్ అన్షుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఆమె సైజులు పెంచుకోవాలని.. ఇప్పుడున్న సైజులు సరిపోవంటూ తెలిపాడు. సైజులు పెంచకుంటే తెలుగులో అవకాశాలు రావంటూ అందరి ముందు చెప్పడంతో తీవ్ర వివాదాస్పదంగా మారిపోయాయి. ఆయన వ్యాఖ్యలతో అక్కడే ఉన్న అన్షు కూడా ఒక్కసారిగా షాక్ కు గురి అయింది. సందీప్ కిషన్ హీరోగా రీతూ వర్మ, అన్షు హీరోయిన్లుగా చేస్తున్న మూవీ మజాకా.
ఈ సినిమా దర్శకుడు కూడా త్రినాథరావు కావడం ఇక్కడ విశేషం. అయితే తన వ్యాఖ్యలపై ఇప్పటి వరకు త్రినాథరావు మాత్రం స్పందించలేదు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా పేరున్న ఆయన.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందరికీ షాకింగ్ గా ఉంది.