Switch to English

ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ కొనసాగేనా.? రద్దయ్యేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. కొన్ని ఏకగ్రీవాలు జరిగాయి.. ఇంతలోనే కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌ ప్రారంభమయ్యింది. పరిస్థితి తీవ్రతను ముందుగా అంచనా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌, స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశారు. అయితే, ఆ వాయిదా నిర్ణయం.. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా తీసుకోవడమేంటి.? అంటూ, ప్రభుత్వ పెద్దలు గుస్సా అయ్యారు. ఈ క్రమంలో నిమ్మగడ్డపై ‘కులం’ పేరుతో దూషణలూ వచ్చాయి అధికార పార్టీ నుంచి.

మరోపక్క, స్థానిక ఎన్నికల్లో హింసపై చాలా ఫిర్యాదులు రావడంతో, ఆ ఫిర్యాదులపై నిమ్మగడ్డ కాస్త కఠిన నిర్ణయాలు తీసుకోవడమూ ప్రభుత్వ పెద్దలకు నచ్చలేదు. ఆ సంగతి పక్కన పెడితే, మళ్ళీ నిమ్మగడ్డ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్నారు.. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో. మధ్యలో ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ని మార్చినా, ఆ ఆర్డినెన్స్‌ చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పిన విషయం విదితమే.

ఇక, ఇప్పుడు స్థానిక ఎన్నికల ప్రక్రియ ఏమవుతుంది.? ఈ స్థానిక ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలో తెచ్చిన ఆర్డినెన్స్‌ కాలపరిమితి ముగిసింది. దాంతో, మళ్ళీ కొత్తగా ఆర్డినెన్స్‌ జారీ చేసింది ప్రభుత్వం. అయితే, రెండుసార్లు ఒకే అంశంపై ఆర్డినెన్స్‌ జారీ చేయడానికి వీల్లేదంటూ ఓ వాదన తెరపైకొచ్చింది. ఇదెంత నిజం.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి, మళ్ళీ మొదటి నుంచి ప్రక్ర్రియ ప్రారంభమయ్యే అవకాశాలు అస్సలేమాత్రం లేవన్నది కొందరు న్యాయ నిపుణుల మాట.

సార్వత్రిక ఎన్నికల్లో అయినా, మరో ఎన్నికల్లో అయినా.. ఏ కారణాలతో ఇబ్బంది వచ్చినా, అప్పటిదాకా జరిగిన ప్రక్రియ కొనసాగుతుంది తప్ప, ఆగిపోదన్నది కొందరు న్యాయ నిపుణుల అభిప్రాయం. అయితే, రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో తలెత్తిన హింస, కరోనా ఎఫెక్ట్‌, ఆర్డినెన్స్‌ల రగడ.. వెరసి, మళ్ళీ మొదటి నుంచి స్థానిక ఎన్నికల్ని నిర్వహించడమే మంచిదన్న వాదనలూ లేకపోలేదు.

‘ఈ మధ్యకాలంలో చాలా జరిగాయి.. ప్రభుత్వ పెద్దలు, సంక్షేమ పథకాల్ని ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్నారు.. ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థుల్ని భయాందోళనలకు గురిచేస్తున్నారు.. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల ప్రక్రియ మళ్ళీ కొత్తగా మొదలు కావాల్సిందే..’ అన్నది విపక్షాల వాదన. మరి, ఎవరి వాదన నెగ్గుతుంది.? ప్రభుత్వం తెచ్చిన కొత్త ఆర్డినెన్స్‌ ప్రకారమే అన్నీ జరుగుతాయా.? ఎక్కడ ఆగిందో, అక్కడినుంచే స్థానిక ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందా.? మళ్ళీ కొత్తగా ఎన్నికల ప్రక్రియ మొత్తం షురూ అవుతుందా.? వేచి చూడాల్సిందే.

స్థానిక సంస్థల్లో సంస్కరణలు.. ఏపీ ప్రభుత్వం మరోసారి ఆర్డినెన్స్ జారీ

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

రాజకీయం

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

ఎక్కువ చదివినవి

డ్రగ్స్, గంజాయి, ఎర్ర చందనం.! మూడు రాజధానులంటే ఇవా.?

ఒకాయన వైసీపీ అంతర్జాతీయ అధికార ప్రతినిథినంటూ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నాడు. యూ ట్యూబ్ ఛానల్ ద్వారా, భలే నవ్వులు పూయిస్తున్నాడు.! జస్ట్ నవ్వులే అనుకునేరు.. అందులో చాలా చాలా విషయం...

Ranbir Kapoor : ‘రామాయణం’ కోసం యానిమల్‌ ఏం చేస్తున్నాడంటే…!

Ranbir Kapoor బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు అన్ని ఇండియన్‌ భాషల సినీ ప్రేక్షకులు నితీష్‌ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్‌ తో...

Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ సందడి షురూ

Vijay Devarakonda : విజయ్‌ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఏప్రిల్‌ 5న విడుదల...

Kamal Haasan: ‘కల్కి’లో తన పాత్ర రివీల్ చేసిన కమల్ హాసన్

Kamal Haasan: అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల సమయం కావడంతో రాజకీయాల్లోనూ నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా...

రాముడి విగ్రహం తల నరికినోళ్ళకి.. అర్చకులు ఓ లెక్కా.?

అంతర్వేది రథం తగలబడితే.. దోషులెవరో దొరకలేదు. వైసీపీ పాలనలో వ్యవస్థలు ఎలా తగలడ్డాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది.? తేనెపట్టుని తీసే ప్రయత్నంలో ఆకతాయిలెవరో మంట పెడితే, అంతర్వేది రథం తగలబెట్టారంటూ వైసీపీ...