సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంట్లో చాన్నాళ్ళ క్రితం జరిగిన కాల్పుల ఘటన అప్పట్లో పెను సంచలనం. ఆ కేసులో బాలయ్య అడ్డంగా బుక్కయిపోయిన మాట వాస్తవం. అప్పుడే, తన మానసిక స్థితి బాగాలేదంటూ బాలయ్య వితండవాదం వినిపించడం, ఈ మేరకు మానసిక వైద్య నిపుణుల నుంచి సర్టిఫికెట్ తెచ్చుకోవడమూ జరిగింది.
ఆ తర్వాత ఆ కేసు నీరుగారిపోయిందనుకోండి.. అది వేరే సంగతి. ఆ కేసు అలా నీరుగారిపోవడానికి కారణం వైఎస్సార్.. అంటున్నారు సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణమురళి.
తన తమ్ముడు బాలకృష్ణ కోసం అప్పట్లో దగ్గుబాటి పురంధరీశ్వరి వైఎస్సార్ కాళ్ళు పట్టుకున్నారట. అలా, వైఎస్సార్ ఆ కేసు నుంచి బాలకృష్ణకు ఉపశమనం కల్పించారట. ‘ఆనాటి ఆ సాయాన్ని మర్చిపోయారా పురంధరీశ్వరిగారూ..’ అంటూ పోసాని కృష్ణ మురళి మీడియా ముందుకొచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు.
అప్పుడేం జరిగిందో కళ్ళకు కట్టినట్లు పోసాని కృష్ణమురళి ఎలా చెప్పగలిగినట్లు.? అంటే, ఆ మొత్తం వ్యవహారానికి పోసాని కృష్ణమురళి ప్రత్యక్ష సాక్షి అయి వుండాలి. అంతేనా.? బ్రోకరిజం.. అనగా, మద్యవర్తిత్వం లాంటిది ఏమన్నా వహించారా పోసాని.?
మిగతా వ్యవహారాలెలా వున్నా, కాల్పుల ఘటన అంటే చిన్న విషయం కాదు. ఆ ఘటనలో బాలయ్యకు శిక్ష పడాలి. కానీ, శిక్ష పడలేదు. పడకుండా చేయడంలో వైఎస్సార్ కీలక పాత్ర పోషించారని పోసాని చెబుతున్నారు. పోసాని చెబుతున్నదే నిజమైతే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంత మొత్తంలో ప్యాకేజీ తీసుకున్నట్టు.? అన్న అనుమానం తెరపైకి రావడం సహజమే.
టీడీపీ దగ్గర జనసేనాని ప్యాకేజీ తీసుకున్నారని పదే పదే వైసీపీ అసత్య ప్రేలాపనలు పేలుతోందనీ, ఇప్పుడు బాలయ్య విషయంలో వైఎస్సార్ ఎంత ప్యాకేజీ తీసుకున్నారో చెప్పాలని జనసైనికులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ‘ప్యాకేజీ స్టార్ వైఎస్సార్’ అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోందిప్పుడు.
Heya this iis kind of off offf topic butt I was wondering if
blogs use WYSIWYG editors orr iif you have to manually
colde withh HTML. I’m starting a blog soonn bbut have nno
coding knowledgge so I wantd to gett guirance from someone wigh experience.
Anyy help woukd be enormously appreciated!