Switch to English

హత్య కేసులో బాలకృష్ణని రక్షించి వైఎస్సార్ మహా నేత అయ్యారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,481FansLike
57,764FollowersFollow

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మహానేత అయ్యారట.. అది కూడా హత్య కేసులో సినీ నటుడు నందమూరి బాలకృష్ణను రక్షించడం వల్లనట.! జన్మనిచ్చినందుకు స్వర్గీయ నందమూరి తారకరామారావుకీ, హత్య కేసు నుంచి రక్షించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డికీ కృతజ్ఞుడై వుండాలట నందమూరి బాలకృష్ణ.

చట్టం ఏం చెబుతోంది.? భారతీయ న్యాయ శాస్త్రం ఏం చెబుతోంది.? హత్య కేసులో నిందితుడ్ని రక్షించేందుకు ప్రయత్నించేవారు సైతం శిక్షార్హులేనని కదా న్యాయ శాస్త్రం చెబుతుంటుంది. ఆ లెక్కన, నందమూరి బాలకృష్ణ హత్య కేసులో ఇరుక్కుపోతే, ఆయన్ని రక్షించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఏమనాలి.?

రాజకీయాల్లో ‘ఇచ్చి పుచ్చుకోవడాల గురించి’ తరచూ వింటుంటాం. వీటినే 60-40 ఒప్పందాలంటుంటాం. రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఖచ్చితమైన అవగాహన ఎప్పుడూ వుంటుంటుంది. ఆ అవగాహన ప్రకారం, ఎవరు అవగాన వుంటే, వారు ఇంకొకరికి పరోక్షంగా సహకరిచాలి. ఒకరు అరవై రూపాయలు తినేస్తే, ఇంకొకరు నలభై రూపాయలు మింగేస్తారన్నమాట.

అప్పట్లో కాంగ్రెస్ – టీడీపీ మధ్య అలాంటి అనుబంధమే కొనసాగిందంటారు. ఇప్పుడేమో వైసీపీ – టీడీపీ మధ్య అంతటి అనుబంధం కొనసాగుతోందనే విమర్శ తరచూ వినిపిస్తోంది. ‘మేం అధికారంలోకి వచ్చాక, వైఎస్ జగన్ దోపిడీని బయటపెడతాం.. ఆ సొమ్ముని ప్రజలకు పంచుతాం..’ అని గతంలో టీడీపీ నినదించింది. అధికారంలోకి వచ్చాక, ఒక్క రూపాయి అయినా వైఎస్ జగన్ నుంచి టీడీపీ రికవరీ చేయగలిగిందా.?

చంద్రబాబు లక్షల కోట్లు దోచేశారంటూ ఏకంగా వైసీపీ పుస్తకాలే వేసింది. ఏదీ ఎక్కడ.? చంద్రబాబు ఆస్తిపాస్తుల నుంచి ఒక్క రూపాయి అయినా వైసీపీ ప్రభుత్వం రికవరీ చేయగలిగిందా.? అప్పట్లో చంద్రబాబు, ఇప్పట్లో వైఎస్ జగన్.. ఎందుకు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు. కేవలం రాజకీయ ఆరోపణలకే ఎందుకు పరిమితమయ్యారు.? ఎందుకంటే 60-40 ఒప్పందమన్నమాట.

చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ దత్త పుత్రుడట, చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడట. అలాగని వైసీపీ ఆరోపిస్తుంటుంది. ఏదీ, మూడేళ్ళలో ఈ విషయమై ఏం నిరూపించగలిగినట్టు.? ఒక్క రూపాయి అయినా, ఇట్నుంచి ఇలా మారింది.. అని ఆ ప్యాకేజీ వివరాల్ని వైసీపీ బయటపెట్టగలిగిందా.? పెట్టదు.

చంద్రబాబు – వైఎస్ జగన్ కలిసి ఆడుతున్న ‘ప్యాకేజీ’ నాటకమిది. మధ్యలో జనసేనను బలిపశువుని చేసే యత్నం. గతంలో వైఎస్సార్ – చంద్రబాబు కలిసి, ప్రజారాజ్యం పార్టీని చంపేశారు. ఇప్పుడు జగన్ – చంద్రబాబు కలిసి జనసేనను చంపే ప్రయత్నం చేస్తున్నారు.

బాలకృష్ణకి వీరాభిమాని కావడం వల్ల వైఎస్ జగన్ స్వయంగా తన తండ్రి మీద ఒత్తిడి తెచ్చి, బాలయ్య మీదున్న హత్య కేసు నుంచి ఆయనకు ఉపశమనం కలిగించి వుంటారని ఎందుకు అనుకోకూడదు.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు....

Chiranjeevi: రాజకీయ ప్రస్థానంపై ‘చిరంజీవి’ ఆసక్తికర వ్యాఖ్యలు..

Chiranjeevi: ‘ఇకపై నా దృష్టంతా సినిమాలపైనే.. జీవితాంతం సినిమాల్లోనే ఉంటాన’ని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఇటివల ఓ కార్యక్రమంలో రాజకీయాలపై ఎదురైన...

‘జితేందర్ రెడ్డి’ మూవీ నుంచి ‘అఆఇఈ’ లిరికల్ సాంగ్ విడుదల

'ఉయ్యాల జంపాల', 'మజ్ను' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు విరించి వర్మ. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో 'బాహుబలి' ఫేమ్ రాకేష్ వర్రే హీరోగా వైశాలి రాజ్,...

Vijay: తల్లి కోసం ఆలయం కట్టించిన హీరో విజయ్.. కారణం ఇదే..

Vijay: ప్రముఖ తమిళ హీరో విజయ్ (Vijay) తన తల్లి కోరిక మేరకు గుడి కట్టించాడనే వార్త వైరల్ అవుతోంది. గతంలోనే ఈ వార్త ప్రచారంలోకి...

Chiranjeevi: “చిరు” సాయం.. పాదచారులకు ఇంటి నుంచి రాగి జావ

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi).. ఈ పేరు తెలుగు సినిమాపై చెరగని సంతకం. సినిమాల్లో తన సమ్మోహన నటనతో అలరిస్తున్న ఆయనే.. నిజజీవితంలో...

రాజకీయం

వివేకం: వైఎస్ విమలారెడ్డి వర్సెస్ షర్మిల శాస్త్రి.!

వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.!...

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...

పవన్ కళ్యాణ్ వెళితేగానీ, తిరుపతి సెట్టవలేదా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళారు, పార్టీ శ్రేణుల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి విషయమై నెలకొన్న గందరగోళాన్ని సరి చేశారు.! జనసేన నేత, టిక్కెట్ ఆశించి భంగపడ్డ కిరణ్ రాయల్, పవన్...

జనసేన యూట్యూబ్ అకౌంట్ హ్యాక్

జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఆ పార్టీకి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా చేరవేస్తున్నారు. అయితే కాసేపటి క్రితం ఈ ఛానల్ హ్యాక్ అయింది....

ఎక్కువ చదివినవి

‘జితేందర్ రెడ్డి’ మూవీ నుంచి ‘అఆఇఈ’ లిరికల్ సాంగ్ విడుదల

'ఉయ్యాల జంపాల', 'మజ్ను' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు విరించి వర్మ. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో 'బాహుబలి' ఫేమ్ రాకేష్ వర్రే హీరోగా వైశాలి రాజ్, రియా సుమన్ హీరోయిన్లుగా 'జితేందర్ రెడ్డి'...

పవన్ కళ్యాణ్ వెళితేగానీ, తిరుపతి సెట్టవలేదా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళారు, పార్టీ శ్రేణుల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి విషయమై నెలకొన్న గందరగోళాన్ని సరి చేశారు.! జనసేన నేత, టిక్కెట్ ఆశించి భంగపడ్డ కిరణ్ రాయల్, పవన్...

Vijay: తల్లి కోసం ఆలయం కట్టించిన హీరో విజయ్.. కారణం ఇదే..

Vijay: ప్రముఖ తమిళ హీరో విజయ్ (Vijay) తన తల్లి కోరిక మేరకు గుడి కట్టించాడనే వార్త వైరల్ అవుతోంది. గతంలోనే ఈ వార్త ప్రచారంలోకి వచ్చినా దీనిపై ఎప్పుడూ స్పందించింది లేదు....

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు. ‘డాక్టర్’ రామ్ చరణ్ అయ్యారు. చెన్నైకి...

Karthikeya: కార్తికేయ “భజే వాయు వేగం”.. ఫస్ట్ లుక్, పోస్టర్ విడుదల

Karthikeya: ఆర్ఎక్స్ 100 సినిమాతో యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న యువ హీరో కార్తికేయ గుమ్మకొండ (Karthikeya). ఆయన నటించిన కొత్త సినిమా "భజే వాయు వేగం". ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా...