సర్వోన్నత న్యాయస్థానంలో కూటమికి చెంప పెట్టు లాంటి తీర్పు వచ్చేసిందన్నట్లుగా వైసీపీ శ్రేణులు పండగ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ‘ఇదే సరైన సమయం జగనన్నా.. తిరుపతికి వెళ్ళు.. నిన్నెవడు ఆపుతాడో మేం చూస్తాం..’ అంటున్నారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు.!
ఇంతకీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తిరుపతికి వెళ్ళే సాహసం ఇప్పట్లో చేస్తారా.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని ఎవరైనా దర్శించుకోవచ్చు. కాకపోతే, అన్యమతస్తులు మాత్రం డిక్లరేషన్ ఇవ్వాల్సి వుంటుందన్నది, టీటీడీ ప్రస్తుతం ‘ఖచ్చితంగా అమలు చేస్తున్న నిబంధన’.!
గతంలో.. అంటే, వైసీపీ హయాంలో, టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి వున్నప్పుడు, ‘డిక్లరేషన్ అవసరం లేదు’ అంటూ, ఆ నిబంధనని పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. ‘వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం వుంది..’ అని మాత్రమే డిక్లరేషన్‌లో అన్యమతస్తులు పేర్కొనాల్సి వుంటుంది.
‘ఇంట్లో నాలుగ్గోడల మధ్యన బైబిల్ చదువుతాను.. బయట, హిందూ మతాన్ని అనుసరిస్తాను..’ అని చెప్పుకునే వైఎస్ జగన్, డిక్లరేషన్ ఇచ్చేస్తే అసలు వివాదమే వుండదు. ‘నా మతం మానవత్వం’ అని డిక్లరేషన్‌లో రాసుకోండి.. అని మొన్నీమధ్యనే ప్రెస్ మీట్ సందర్భంగా వైఎస్ జగన్, ‘తేలిక మాటలు’ మాట్లాడేశారు.
నిజానికి, డిక్లరేషన్‌లో సంతకం పెట్టాల్సింది స్వయానా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! అంతలా, డిక్లరేషన్ విషయమై అహంకారం ప్రదర్శించిన వైఎస్ జగన్, ఇప్పుడు తిరుపతి వెళ్ళాలని ఆలోచిస్తే, హిందూ సమాజం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాల్లేకపోలేదు.
పైగా, సర్వోన్నత న్యాయస్థానం లడ్డూ ప్రసాదం విషయమై ఇంకా ఎలాంటి తీర్పులూ ఇచ్చేయలేదు. అరకొర జ్ఞానంతో సోషల్ మీడియాలో రెచ్చిపోయే సోకాల్డ్ పెయిడ్ నీలి కూలీలు, ఫస్ట్ హియరింగ్ సందర్భంగా నడిచిన వాదోపవాదాల్ని ‘తీర్పు’గా భావించడంలో వింతమేంది.?