ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం జరగబోతోందా.. మాజీ సీఎం వైఎస్ జగన్ భార్య భారతిరెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అదికూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులోనే. వివేకా హత్య కేసు ఎప్పుడూ కూడా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఈ కేసులో ఎవరు అరెస్ట్ అవుతారా.. ఎవరి పేరు కొత్తగా తెరమీదకు వస్తుందా అనే ఇంట్రెస్టింగ్ న్యూస్ ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. ఇప్పటికే ఈ కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయి బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు. కాగా త్వరలోనే సీబీఐ అధికారులు భారతిని కూడా అదుపులోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది.
ఎందుకంటే ఈ కేసులో భారతిరెడ్డి పాత్ర కూడా ఉందనే ఆరోపణలు గతంలో నుంచే వినిపిస్తున్నాయి. కడప ఎంపీ టికెట్ విషయంలో అవినాష్, వివేకా మధ్య గొడవలు వచ్చాయంట. అయితే ఎంపీ టికెట్ తో పాటు పార్టీ మీద పెత్తనం కోసమే వివేకాను హత్య చేశారంటూ గతంలో నుంచే టీడీపీ ఆరోపిస్తోంది. వివేకా హత్య ప్లానింగ్ లో భారతి కూడా ఉందంటూ ఆరోపణలు రావడంతో ఇప్పుడు సీబీఐ కూడా విచారణలో భాగంగా భారతిని అదుపులోకి తీసుకునేందుకు రెడీ అవుతోంది. ఏ క్షణంలో అయినా భారతిని అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉందంట. ఆమెను ఈ కేసు విషయంలో పూర్తిగా విచారిస్తారని అంటున్నారు.
గతంలోనే ఆమెను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ అప్పుడు వైసీపీ అధికారంలో ఉండటమో లేదంటే ఇతర కారణాల వల్లనో తెలియదు గానీ.. ఆమెను సీబీఐ అరెస్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉండటంతో సీబీఐ ఈ కేసులో మళ్లీ దూకుడును ప్రదర్శిస్తోంది. ఇదే జరిగితే మాత్రం జగన్ కు మరింత ఇబ్బందులు తప్పవని అంటున్నారు రాజకీయ నిపుణులు. భారతి అరెస్ట్ వైసీపీ ఇమేజ్ ను మరింత కిందకు పడేస్తుందని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందనేది వేచి చూడాలి