Switch to English

అంతులేని ప్రేమ.! టీడీపీతో వైసీపీ జత కట్టొచ్చుగా.?

తెలుగుదేశం పార్టీ మీద అంతు లేని ప్రేమ ప్రదర్శిస్తోంది అధికార వైసీపీ. వినడానికి చిత్రంగా వున్నా ఇది నిజం. తెలుగుదేశం పార్టీకి 2019 ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే దక్కారు. ఆ తర్వాత ఆ పార్టీ నుంచి కొందరు ఎమ్మెల్యేలను నాటకీయంగా లాక్కుంది వైసీపీ.

నిజానికి, వైసీపీ తలచుకుంటే, టీడీపీలో చంద్రబాబు తప్ప ఇంకే ప్రజా ప్రతినిథీ మిగిలేవారు కాదు. కానీ, వైసీపీ అలా ఎందుకు చేయలేదు.? అంటే, టీడీపీ మీద ‘అంతు లేని ప్రేమ’ కారణంగానే. రాజకీయాల్లో అయితే టీడీపీ వుండాలి.. లేదంటే వైసీపీ వుండాలి.. ఆ రెండు పార్టీలు తప్ప, ఇంకో పార్టీ వుండకూడదన్నది ఇరు పార్టీల లక్ష్యం.

బీజేపీ – జనసేన ప్రస్తుతానికి రాజకీయంగా పొత్తులో వున్నాయి. ఆ పొత్తుని విచ్ఛిన్నం చేయాలంటే, టీడీపీకి జనసేనకు అక్రమ సంబంధం అంటగట్టాలి. తద్వారా టీడీపీకి లాభం చేకూర్చాలి.. ఇదీ వైసీపీ వ్యూహం. నిజానికి, టీడీపీ కథ 2019 ఎన్నికల్లోనే ముగిసింది. స్థానిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం కనీసపాటి ప్రభావం చూపలేదంటే, దానికి కారణమేంటి.? వైసీపీతో వున్న 60-40 అవగాహనే.

స్థానిక ఎన్నికల్లో అధికార వైసీపీతో గట్టిగా కొట్లాడింది జనసేన పార్టీనే. అందుకే, ఆ జనసేనను రాజకీయంగా చంపేయాలనే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. ఈ క్రమంలో టీడీపీకి జాకీలేస్తోంది వైసీపీ. అసలంటూ టీడీపీ ప్రస్తావనే వైసీపీ తీసుకురాకపోతే, ఏపీ రాజకీయాల్లో టీడీపీ కథ ఎప్పుడో ముగిసిపోయేది.

జనసేన – టీడీపీ పొత్తు ద్వారా టీడీపీకి లాభం చేకూర్చాలని తహతహలాడుతున్న వైసీపీ, నేరుగా ఎందుకు టీడీపీతో జతకట్టకూడదు.? ఇదే ప్రశ్న వైసీపీ మద్దతుదారుల్లోనే జరుగుతోందిట. ‘ఒకప్పటి వైసీపీకి, ఇప్పటి వైసీపీకీ అస్సలు పొంతన లేదు. ఇప్పుడు వైసీపీలో జరుగుతున్నదంతా దివాళా కోరు రాజకీయం..’ అని వైసీపీ నేతలే ఆఫ్ ది రికార్డుగా చెప్పుకుంటున్నారు.

అచ్చం చంద్రబాబు డైరెక్షన్లోనే.. పబ్లిక్ మీటింగుల్లో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ పెడుతున్న శాపనార్థాలు చూస్తోంటే, వైసీపీకి సమీప భవిష్యత్తులో చంద్రబాబే గౌరవాధ్యక్షుడిగా మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: మాస్ కు కేరాఫ్ అడ్రెస్ గా...

కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండే మాస్ కథాంశాల్ని చిరంజీవి ఎక్కువగా చేశారు. పాత్రను అన్వయం చేసుకుని తనదైన శైలిలో నటించి హీరోగా చిరంజీవి ఎలివేట్ అయిన...

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

రాజకీయం

కొత్త సమస్య.. ఆ నదిపై ప్రాజెక్టు వద్దని ఏపీ సీఎంకు తమిళనాడు సీఎం లేఖ

ఏపీ-తమిళనాడు సరిహద్దులో కుశస్థలి అంతర్రాష్ట్ర నదిపై జలాశయాల నిర్మాణం చేపట్టొద్దని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ లేఖలో కోరారు. ‘కుశస్థలి నదిపై ఏపీ ప్రభుత్వం 2చోట్ల...

ఎలక్షన్ ఫీవర్.! అసెంబ్లీ నియోజకవర్గానికి 30 కోట్లు ఖర్చు మాత్రమేనా.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఎన్నికలంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందన్నది నిర్వివాదాంశం. అసెంబ్లీ నియోజకవర్గానికే 150 కోట్ల పైన ఖర్చు చేసిన ప్రబుద్ధులున్నారు రాజకీయాల్లో.. అంటూ 2019 ఎన్నికల సమయంలో ప్రచారం...

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

ఎక్కువ చదివినవి

మహేశ్ బర్త్ డే స్పెషల్స్: దూకుడు నుంచి టాలీవుడ్ కు ఓవర్సీస్ మార్కెట్ పెంచిన మహేశ్

మహేశ్ బాబు కెరీర్ గ్రాఫ్ అంటే పోకిరికి ముందు ఆ తర్వాతగా మారిపోయింది. ఆయన కెరీర్లో పోకిరి సృష్టించిన మేనియా ఆస్థాయిలోనిది. ఈ సినిమా తర్వాత వచ్చిన సైనికుడులో తొలిసారి సూపర్ స్టార్...

రాశి ఫలాలు: బుధవారం 10 ఆగస్ట్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు శ్రావణ మాసం సూర్యోదయం: ఉ.5:46 సూర్యాస్తమయం: సా.6:32 తిథి: శ్రావణ శుద్ధ త్రయోదశి మ.12:27 వరకు తదుపరి చతుర్దశి సంస్కృతవారం: సౌమ్యవాసరః (బుధవారం) నక్షత్రము:పూర్వాషాఢ ఉ.8:40 వరకు తదుపరి ఉత్తరాషాఢ యోగం: ప్రీతి...

‘సినిమాల్లో ఫోజులిచ్చినంత తేలిక్కాదు రాజకీయం’ పవన్ పై మంత్రి ధర్మాన వ్యాఖ్యలు

‘ప్రజా జీవితం మాటలు చెప్పినంత తేలిక కాదు.. పవన్ కల్యాణ్ ఈ సత్యాన్ని తెలుసుకోవాలి’ అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం లింగాలవలసలో నిర్వహించిన గడప గడపకూ...

గోరంట్ల మాధవుడి లీలలు.! ఇంతకన్నా ఏం ఆశించగలం.?

ఓ న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమంలో ఓ రాజకీయ విశ్లేషకుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైనా.. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలపైనా.! ‘అక్రమాస్తుల...

ఇన్స్టాగ్రామ్ లో అన్ని పోస్ట్ లను డిలీట్ చేసిన రానా

రానా దగ్గుబాటి విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునే పనిలో ఉన్నాడు. సినిమా నచ్చితే అది హీరో పాత్రా కానీ క్యారెక్టర్ రోల్ అన్నది కూడా చూడడు రానా దగ్గుబాటి. ఇదిలా...