Switch to English

పత్రికల శానిటైజేషన్‌.. ఇలాగైనా భయం తగ్గేనా.?

కరన్సీ నోటుని తీసుకోవడానికి కూడా జనం ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. కానీ, తప్పడంలేదు. వీలైనంతవరకు డిజిటల్‌ పేమెంట్స్‌ వైపు జనం మొగ్గుచూపుతున్నారంటే.. ‘కరోనా వైరస్‌’ భయం ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. కానీ, వార్తా పత్రికలు చాలా సేఫ్‌.. అంటూ మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. డాక్టర్లు కూడా ఈ విషయమై వార్తా పత్రికల తరఫున మాట్లాడుతున్నారు. ‘వార్తా పత్రికల మీద గంట సేపు మాత్రమే కరోనా వైరస్‌ వుండే అవకాశముంది. ఓ గంట సేపు వార్తా పత్రికను బయట వదిలేయండి..’ అని ఓ డాక్టర్‌ చెప్పడం గమనార్హం.

కానీ, జనాల్లో వున్న భయాలు తొలగిపోవడం అంత తేలిక కాదు. ‘పేపర్‌ చూడకపోతే వచ్చే నష్టమేంటి.?’ అన్న భావనతో జనం వున్నారు. ఎలాగూ వార్తా పత్రికలకు సంబంధించి ఇ-పేపర్‌ అందుబాటులోనే వుంటోంది. సో, ఇప్పుడెంతగా మొత్తుకున్నా పత్రికల వైపు జనం చూసేందుకు అవకాశమే లేదు.

ఇదిలా వుంటే, ‘శానిటైజర్‌ వాడుతున్నాం..’ అంటూ సాక్షి మీడియా, జనాన్ని ‘ఎడ్యుకేట్‌’ చేసేందుకు ప్రయత్నిస్తోంది. నిజానికి, పత్రికల ప్రింట్‌ ఆపేద్దామనే ప్రతిపాదన వచ్చిందట.. దానికి దాదాపుగా అందరు మీడియా అధిపతులూ ‘ఓకే’ చెప్పారనీ, అయితే, ‘ఈనాడు’ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మాత్రం ఒప్పుకోలేదనీ, ఆయనే శానిటైజేషన్‌ అనే ప్రతిపాదన తెచ్చారనీ, దానికి సాక్షి సహా మిగతా పత్రికలన్నీ ‘ఓకే’ చెప్పక తప్పలేదనీ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.

జర్నలిస్టులు తమ పని తాము చేసినా, పత్రికలు బయటకు రావాలంటే మళ్ళీ అదో పెద్ద కథ. ఆ వార్తా పత్రిక, పాఠకుల ఇళ్ళకు చేరాలంటే మళ్ళీ అదో ప్రసహనం. ఇవన్నీ ఎందుకు దండగ.? పైగా, ప్రకటనలు కూడా తగ్గిపోయాయ్‌.! దాంతో, కొన్నాళ్ళు.. అంటే, లాక్‌ డౌన్‌ పూర్తయ్యేదాకా ప్రింట్‌ ఆపేయడమే శ్రేయస్కరమని మెజార్టీ మీడియా సంస్థలు ఓ నిర్ణయానికి వచ్చినా, రామోజీరావు అందుకు ససేమిరా అనడంతోనే.. వ్యవహారం మొదటికొచ్చిందని అనుకోవాలేమో.

ప్రపంచంలో అన్ని విభాగాలూ కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.. ప్రింట్‌ మీడియా కూడా అందుకు అతీతమేమీ కాదు. వెబ్‌ మీడియాకి ఇప్పుడు విపరీతమైన క్రేజ్‌ ఏర్పడుతోంది. దురదృష్టవశాత్తూ వెబ్‌ మీడియా ముసుగులో కొందరు ఫేక్‌ వార్తల్ని ఎక్కువగా ప్రచారం చేస్తున్నారనుకోండి.. అది వేరే విషయం.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

బన్నీ కోసం మారుతి కథ రెడీ అయిపోయిందా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు, సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతికి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఇద్దరూ చాలా క్లోజ్. ఇటీవలే మారుతి మాట్లాడుతూ తామిద్దరం వాట్సాప్ లో తరచూ టచ్...

బిగ్ బాస్ స్టార్ తండ్రి ఒక రేపిస్ట్

హిందీ బిగ్ బాస్ 13వ సీజన్ లో అందరి దృష్టిని ఆకర్షించింది నటి, సింగర్, మోడల్ షెహనాజ్ గిల్ మళ్ళీ వార్తల్లో నిలిచింది. బిగ్ బాస్ వల్ల మరింత క్రేజ్ దక్కించుకున్న షెహనాజ్...

ఫ్లాష్ న్యూస్: లైవ్ ఇంటర్వ్యూలో భూకంపానికి బెదరని ప్రధాని.!

మనం మాట్లాడుతున్నప్పడు ఏదైనా శబ్దం వస్తేనే విసుగనిపిస్తుంది.. భారీ శబ్దమైతే ఉలిక్కిపాటుకు గురవుతాం. కానీ.. ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోను అని నిరూపిస్తున్నారు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్. వెల్లింగ్టన్ లో స్థానికంగా ఓ...

పిక్ ఆఫ్ ది డే: సమ్మర్లో బికినీతో సెగలు పుట్టిస్తున్న వరుణ్ తేజ్ బ్యూటీ.!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'లోఫర్' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హాట్ బ్యూటీ దిశా పటాని. ఆ తర్వాత తెలుగులో...

రీమేక్‌ అప్‌డేట్‌ మెగాస్టార్‌ మూవీలో విజయశాంతి

మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ లూసీఫర్‌ను తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి రీమేక్‌ చేయబోతున్నట్లుగా చాలా బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ విషయాన్ని కొట్టి వేయక పోవడంతో నిజమే అయ్యి ఉంటుందని...