Switch to English

రాపాక.. జనసేనకి దూరంగానా.? దగ్గరగానా.?

జనసేన పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌, జనసేన పార్టీలో వున్నారో లేదో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కే తెలియదు. ఈ విషయమై రాపాక వరప్రసాద్‌ని ప్రశ్నిస్తే, ‘నేను జనసేన పార్టీకి దూరంగానూ లేను.. అలాగని దగ్గరగానూ లేను..’ అని సెలవిచ్చారు. ‘నేనింకా జనసేన పార్టీ ఎమ్మెల్యేనే. ప్రజలకు మేలు జరిగే విషయాలకు సంబంధించి ప్రభుత్వానికి మద్దతిస్తాను.. ఓ ప్రజా ప్రతినిది¸గా అది నా బాధ్యత..’ అని చెప్పుకొచ్చారు రాపాక వరప్రసాద్‌ తాజాగా.

పార్టీలో వుంటూ, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కరిన చర్యలుంటాయనీ.. పార్టీ మీద బురద జల్లే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామనీ జనసేన పార్టీ తాజాగా ప్రకటించిన నేపథ్యంలో రాపాక వరప్రసాద్‌ స్పందన రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవలి కాలంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పట్ల కనిపిస్తున్న ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో రాపాక మనసు మార్చుకున్నారనే ఊహాగానాలు విన్పిస్తున్నాయి.

మరోపక్క, జనసేన పార్టీకి దూరంగా జరగడం వల్ల సొంత నియోజకవర్గంలో వెల్లువెత్తుతున్న నిరసనలు రాపాక వరప్రసాద్‌ మనసు మార్చుకునేలా చేశాయేమోనని జనసేన పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వున్న ఒకే ఒక్క ఎమ్మెల్యేని వదులుకునేందుకు జనసేన పార్టీ సుముఖత వ్యక్తం చేయకపోవచ్చు. అదే సమయంలో, పార్టీకి దూరంగా వుంటోన్న ఆయన్ని బతిమాలుకునే పరిస్థితి కూడా జనసేనకు వుండదు. ఏదో ఆశించి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి రాపాక మద్దతిస్తున్నారనీ, అయితే ఆయన ఆశిస్తున్నది అక్కడ జరిగే పరిస్థితి లేకపోవడంతోనే ఆయన కొత్త వాదనను తెరపైకి తెచ్చారనీ రాజోలు జనసైనికులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే రాజోలు నియోజకవర్గంలో జనసైనికులు పూర్తిగా రాపాకకు దూరమైపోయారు. నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు సైతం రాపాకను దూరం పెడుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా జనసేనకు కాస్త దూరంగా వున్న రాపాక, జనసేనకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లే కన్పిస్తోంది.

సినిమా

చిరు – నాగ్ లకు ప్రధాని మోదీ అభినందనలు.!

కరోనా అనే మహమ్మారి వలన ప్రపంచం స్తంభించిపోయింది. ఇండియా మొత్తం లాక్ డౌన్ కారణంగా ఎక్కడి వాళ్ళు అక్కడే లాక్ అయ్యారు. ప్రజల్ని ఎప్పటికప్పుడు ఎంటర్టైన్...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కు కాస్ట్‌ కట్టింగ్‌ తప్పదా?

రాజమౌళి సినిమా అంటే భారీ బడ్జెట్‌కు పెట్టింది పేరు. ఈగతో సినిమా తీసినా కూడా దానికి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టిన ఘనత రాజమౌళికి...

పవన్‌ ఆ రెండు సినిమాలు ఈ ఏడాది చేయడేమో!

అజ్ఞాతవాసి తర్వాత రెండేళ్ల గ్యాప్‌ తీసుకున్న పవన్‌ కళ్యాణ్‌ కొన్నాళ్ల క్రితం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలకు కమిట్‌ అయ్యాడు. కెరీర్‌లో...

మహేష్‌, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ మద్య రచ్చ

మహేష్‌ బాబు హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాకు అనీల్‌ రావిపూడి దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల...

కరోనాతో అల్లు వారి ‘ఆహా’లో ఢొల్ల బయటపడినది

రాబోయే రోజుల్లో ఓటీటీ రాజ్యం ఏళబోతుందని చాలా మంది అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా వంటి దేశాల్లో ఓటీటీ బిజినెస్‌ చాలా లాభసాటిగా ఉంది. ఇండియాలో...

రాజకీయం

జగన్‌ సారూ.. కరోనా ప్రాణం తీసింది చూడూ.!

‘పారాసిటమాల్‌ ట్యాబ్లెట్‌ వేసుకుంటే కరోనా వైరస్‌ నయమైపోతుంది.. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లితే వైరస్‌ తగ్గిపోతుంది..’ అంటూ మొదట్లో కరోనా వైరస్‌ని చాలా తేలిగ్గా తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. కరోనా...

వైఎస్‌ జగన్‌ సర్కార్‌ని పవన్‌ ప్రశ్నిస్తే.. ఎదురు దాడి చేయడమేంటి.?

జనసేన అధినేత ప్రజా సమస్యలపై పోరాటం విషయంలో ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. కష్టం ఎక్కడ వచ్చినా, బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొస్తారాయన. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంలో పవన్‌ కళ్యాణ్‌ చిత్తశుద్ధి ఏంటన్నది బాధిత...

బోయింగ్ కు కరోనా సెగ: లేఆఫ్ దిశగా…

యావత్ ప్రపంచాన్ని నిలువెల్లా వణికిస్తున్న కరోనా మహమ్మారితో వివిధ రంగాలు ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఓ వైపు మానవాళి ఆరోగ్యానికి సవాల్ గా పరిణమించిన కోవిడ్-19.. మరోవైపు ఆర్థికపరమైన సంక్షోభానికీ కారణమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా...

రెడ్డిగారి నిస్సిగ్గు రాజకీయం.. నవ్విపోదురుగాక ఆయనకేటి.!

విజయసాయిరెడ్డి.. పరిచయం అక్కర్లేని పేరిది. వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడిగా వున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోనూ ఆయనే నెంబర్‌ టూ పొజిషన్‌లో వున్నారన్నది జగమెరిగిన సత్యం. ఎంపీగా రాజ్యసభకు ప్రాతినిథ్యం...

9 నిమిషాలు.. మళ్ళీ నిరాశపర్చిన నరేంద్ర మోడీ

దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసింది ఈ రోజు ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీడియో సందేశం ఇవ్వబోతున్నారనే ప్రకటన నిన్న రావడంతో. ఏం చెబుతారు నరేంద్ర మోడీ.? లాక్‌ డౌన్‌ ఎత్తివేతపై ఆయనేమైనా...

ఎక్కువ చదివినవి

కన్నీరు పెట్టుకున్న జబర్దస్త్‌ యాంకర్‌

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో పేద వారు తిండి లేక అల్లాడి పోతున్నారు. కరోనాతో మరణిస్తున్న వారి సంఖ్యతో సమానంగా త్వరలోనే ఆకలి చావులు కూడా ఉంటాయేమో అనే ఆందోళన...

ఇన్‌సైడ్‌ స్టోరీ: డాక్టర్లపై దాడులా.? సిగ్గు సిగ్గు.!

పైత్యం పెరిగిపోతే అంతే మరి.! కరోనా మహమ్మారి నుంచి ప్రజల్ని కాపాడే బాధ్యతను భుజానికెత్తుకున్న వైద్యుల మీద రాళ్ళు వేయడమా.? ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఇంకోటి వుండదు.! డాక్టర్ల మీద దాడులు కొత్తేమీ...

ఈ గ్రామ వాలంటీర్ల గోలేంటి మహా ప్రభో.!

క్లిష్ట పరిస్థితుల్లో గ్రామ వాలంటీర్లు, ప్రభుత్వం చెప్పిన పనిని బాథ్యగా నిర్వర్తిస్తున్నందుకు అభినందించాల్సిందే. కానీ, కరోనా వైరస్‌ మీద ఫోకస్‌ పెట్టే క్రమంలో ‘గ్రామ వాలంటీర్‌’ వ్యవస్థ చుట్టూ ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌...

ఎన్టీఆర్‌ బర్త్‌డేకూ ఇదే తరహా గిఫ్ట్‌ ఉండేనా?

రామ్‌ చరణ్‌ బర్త్‌డే సందర్బంగా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని ఆయన అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన లుక్‌ రివీల్‌ అయ్యింది. నిన్న ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌తో రామరాజు వీడియోను విడుదల చేశారు. చరణ్‌ బర్త్‌డేకు...

21 రోజుల లాక్ డౌన్ చాలదట!

కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశంలో 21 రోజుల లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. వైరస్ వ్యాప్తిని అరికట్టే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14తో...