ప్రభాస్ “రాజా సాబ్” అనే హారర్-కామెడీ చిత్రంతో సిద్దమవుతున్న విషయం తెలిసిందే. హారర్ కథలలో స్టార్ హీరోలు సాధారణంగా రిస్క్ తీసుకోరు, ఎందుకంటే ఆ అందులో లాజిక్స్ కి న్యాయం చేయడం అంటే స్క్రీన్ ప్లే బలంగా ఉండాలి. ప్రభాస్ మాత్రం ఈ సాహసానికి సిద్ధమయ్యారు అంటే మారుతి కథపై ఎంత నమ్మకం ఉంచారో అర్థం చేసుకోవచ్చు.
ఇటీవలి కాలంలో ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా, ఆయన హారర్ కథలో ఎలా కనిపిస్తారు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. 2005లో సూపర్ స్టార్ రజినీకాంత్ “చంద్రముఖి” చిత్రంతో హారర్ కంటే ఎక్కువగా ప్రేక్షకుల మదిలో సుదీర్ఘ ప్రభావం చూపించారు. అప్పుడు హారర్ ఎలిమెంట్స్‌ను బాగా సమర్ధవంతంగా డీల్ చేసిన దర్శకుడు వాసు హీరోను ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ చేశారు. కానీ, ఆ తర్వాత అగ్ర హీరోలు కూడా ఈ తరహా కథలపై ఎక్కువగా దృష్టి పెట్టలేదు.
రజినీకాంత్ తరువాత మళ్ళీ ఆ రేంజ్ ఉన్న హీరోలలో ప్రభాస్ మాత్రమే హారర్ కథను టచ్ చేస్తున్నాడు. కాస్త కమర్షియల్ హంగులతో రొమాన్స్ కామేడిని కూడా చూపించనున్నారు. కంటెంట్ ఏమాత్రం క్లిక్కయినా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్లాస్ట్ అవ్వడం పక్కా. “రాజా సాబ్” సినిమా ప్రభాస్ కెరీర్‌లో మరొక నూతన ప్రయోగంగా నిలిచే అవకాశం ఉంది. ఈ సినిమాను 2025 ఏప్రిల్ 10న విడుదల కానుంది.