ప్రముఖ సంగీత దర్శకులు కన్సర్ట్ లు నిర్వహించడం కొత్తేమి కాదు. ఈ మధ్యే ఇళయరాజా కన్సర్ట్ హైదరాబాద్ లో జరిగింది. దీనికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ ప్రోగ్రాంకు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవమే.
అయితే నిన్న చెన్నైలో జరిగిన రహమాన్ కన్సర్ట్ అయితే మొత్తం పెంట పెంట అయిందని చెప్పాలి. కనీసం టికెట్లు కొన్నవాళ్లకు కూడా సీటింగ్ లేని పరిస్థితి. దాంతో వేలకు వేలు డబ్బులు పోసి గంటలు ప్రయాణం చేసిన ప్రేక్షకులు చివరికి కన్సర్ట్ లోపలికి అడుగుపెట్టకుండానే వెనుతిరగాల్సిన పరిస్థితి.
పోనీ లోపల ఉన్నవాళ్ళైనా కన్సర్ట్ ను ఎంజాయ్ చేసారా అంటే అది కూడా లేదు. లోపల ఉన్న వాళ్లకు తొక్కిసిలాట జరిగింది. చివరికి పోలీసులు కూడా చేతులెత్తేశారు. సౌండ్ సిస్టం బాలేదు, కన్సర్ట్ ను మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి. మరి ఇంత ఘోరంగా రహమాన్ వంటి టాప్ సంగీత దర్శకుడి కన్సర్ట్ ను నిర్వహించిన ఏవిటిసి ఈవెంట్స్ వాళ్ళు క్షమాపణలు చెబుతారా?