ఏంటి జగన్ కు పవన్ కల్యాణ్ హెల్ప్ చేస్తున్నాడా.. అది ఎలా అని షాక్ అయిపోకండి. ఎందుకంటే వైసీసీకి జనసేనకు ఒక్క నిముషం కూడా పడదు. అలాంటి ఈ రెండు పార్టీల అధినేతలు అయితే ఒకరికి ఒకరు అస్సలు హెల్ప్ చేసుకోరు. ఇక తాజాగా పవన్ కల్యాణ్ మాత్రం ఇన్ డైరెక్టుగా జగన్ కు మేలు చేస్తున్నారు. ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలపడాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటోంది. కానీ ఆ ఛాన్స్ మాత్రం పవన్ కల్యాణ్ ఇవ్వట్లేదు. ఇప్పుడు వైసీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. దాంతో ఆ పార్టీ నేతలంతా ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు.
పార్టీ మారాలి అనుకునే వారంతా జనసేన వైపే చూస్తున్నారు. జనసేన పార్టీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో పాటు చాలా మంది ఇప్పుడు జనసేనలోకి వెళ్లిపోతున్నారు. వాస్తవానికి వైసీపీకి పోటీగా కాంగ్రెస్ మారాలని చూస్తోంది. షర్మిల ఎలాగైనా వైసీపీ నుంచి నేతలను తమ పార్టీలో చేర్చుకుని వైసీపీని బలహీన పర్చి కాంగ్రెస్ ను ప్రత్యామ్నాయ పార్టీ మార్చాలని అనుకుంది. ఇప్పుడు వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్తున్న వారంతా కూడా ఒకప్పుడు కాంగ్రెస్ లో ఎదిగిన వారే.
కానీ వారు కాంగ్రెస్ లోకి వెళ్లకుండా జనసేనలోకి వెళ్లేలా పవన్ కల్యాణ్ వ్యూహాలు కదుపుతున్నారు. ఒకవేళ వాళ్లంతా కాంగ్రెస్ లోకి వెళ్లి ఆ పార్టీ బలపడితే అప్పుడు వైసీపీ నిండా మునిగిపోయేది. అలా జరగకుండా పవన్ కల్యాణ్ అడ్డుకుంటున్నాడన్నమాట. ఇది జగన్ కు చాలా మేలు చేసే అంశం. జనసేన బలపడితే వైసీపీకి నష్టం లేదు. ఎందుకంటే జనసేన కూటమి ప్రభుత్వంలో ఉంది కాబట్టి.. ప్రతిపక్షంలో కేవలం వైసీపీ మాత్రమే ఉంటుంది. అప్పుడు ప్రభుత్వానికి ఆల్టర్నేటివ్ గా కేవలం వైసీపీనే కనిపిస్తోంది. ఇలా జగన్ కు పవన్ మేలు చేస్తున్నాడన్నమాట.