జూనియర్ ఎన్టీఆర్( Jr NTR) ప్రస్తుతం “దేవర”( Devara ) ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈనెల 27న థియేటర్లలో విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ ఎన్టీఆర్ సరసర నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ రికార్డులు సృష్టిస్తున్నాయి. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా “దేవర” టీం ను ఇంటర్వ్యూ చేశారు.
ఈ ఇంటర్వ్యూలో ఆ టీమ్ “దేవర” షూటింగ్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగా కుదిరాయని, 35 రోజులపాటు అండర్ వాటర్ లో షూటింగ్ చేశామని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. తిమింగలం తో ఫైట్ సీన్ ఊహించిన దానికంటే చాలా బాగా వచ్చిందని చెప్పారు. ఈ చిట్ చాట్ కి సంబంధించిన ప్రోమోను మూవీ టీం సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఫుల్ ఇంటర్వ్యూను ఆదివారం రిలీజ్ చేస్తామని చెప్పింది. దీంతోపాటు ఎన్టీఆర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సందీప్ రెడ్డి వంగాతో చేయనున్నారంటూ ఊహాగానాలు వెలవడుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో ఆ ప్రాజెక్టు గురించి అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. “యానిమల్” మూవీ హిట్ తో సందీప్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ కి కూడా ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉండటంతో ప్రాజెక్ట్ పక్కా అని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Goodd post. I llearn something totally new and challenging on blogs
I stumbleupon everyday. It will alwys bee useeful tto read through content
frlm otherr writers andd use a littyle something from their sites.