ఎన్టీఆర్ కు ఇప్పుడు చాలా పెద్ద సవాల్ ముందుంది. అదే దేవర. సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద ఎన్టీఆర్ నార్త్ ఇండియా భవిష్యత్ ఆధారపడి ఉంది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ సినిమాలు హిందీలో నేరుగా రిలీజ్ చేయలేదు. జక్కన్న పుణ్యమా అని త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ కు అంతో ఇంతో మార్కెట్ ఏర్పడింది. అయితే అది జక్కన్న మూవీ. కానీ ఇప్పుడు దేవర మాత్రం ఎన్టీఆర్ క్రేజ్ తోనే అక్కడ ఆడాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం ఎన్టీఆర్ కు అక్కడ మార్కెట్ లేదని ప్రూవ్ అవుతుంది.
దేవర కోసం ఎన్టీఆర్ చాలా ప్లాన్లు వేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్, బాలీవుడ్ విలన్లను ఇందులో పెట్టారు. దాంతో పాటు ట్రైలర్ కూడా ముంబైలోనే లాంచ్ చేశారు. స్టార్ హీరోయిన్ ఆలియా భట్ వచ్చి కావాల్సినంత ప్రమోషన్ చేసింది. దాంతో పాటు బాలీవుడ్ బడా స్టార్ కరణ్ జోహార్ కూడా వచ్చి స్వయంగా లాంచ్ చేశాడు కాబట్టి.. దేవరకు ఇప్పుడు హిందీలో మార్కెట్ పెరుగుతుందని అంటున్నారు. కానీ ఇది ఏ రేంజ్ లో అనేది వెయిట్ చేయాలి.
ఎందుకంటే ప్రభాస్ బాహుబలి తర్వాత సొంతంగానే హిందీలో మార్కెట్ పెంచుకున్నాడు. ఇప్పుడు ఇండియాలో అగ్ర హీరోగా ఎదిగిపోయాడు. ప్రభాస్ తర్వాత హిందీ మార్కెట్లోకి భారీ ఎత్తున ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తున్నాడు. దాంతో ప్రభాస్ రేంజ్ లో ఎన్టీఆర్ సక్సెస్ అవుతాడా లేదా అన్నది అందరి మదిలో ఉన్న ప్రశ్న. తొలిరోజే దీనికి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఎంత లేదన్నా ప్రభాస్ కటౌట్, ఆయనకు బాహుబలితో పెరిగిన మార్కెట్ వల్ల ఆయన పెద్ద స్టార్ అయ్యాడు. కానీ ఎన్టీఆర్ ఇప్పుడు ఆ రేంజ్ లో రాణిస్తాడా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.