నాని .. టాలీవుడ్ లో నాచురల్ స్టార్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకుని అచ్చంగా మన పక్కింటి అబ్బాయి అనిపించుకున్నాడు నాని. భిన్నమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు నాని. అయితే ఈ మధ్య నానికి వరుస పరాజయాలు ఎదురయ్యాయి. దానికి కారణం భిన్నమైన సినిమాలు, కొత్త దర్శకులతో సినిమాలు చేయడమే.
అందుకే ఇప్పుడు నాని ఫోకస్ మార్చాడట. ఇకపై సక్సెస్ ఫుల్ దర్శకులతోనే సినిమాలు చేయాలనీ ఫిక్స్ అయ్యాడట. ప్రస్తుతం మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వి సినిమాలో నటిస్తున్నాడు నాని, ఈ సినిమా తరువాత ఇంకా ఏ సినిమాకు ఓకే చెప్పలేదు. ఈ మద్యే విక్రమ్ కుమార్ తో చేసిన గ్యాంగ్ లీడర్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోడంతో నాని తీవ్ర నిరాశకు లోనయ్యాడు.
అంతకుముందు నాగార్జున తో కలిసి చేసిన దేవ దాస్ కూడా యావరేజ్ హిట్ గా నిలవడం. జెర్సీ తప్ప ఏ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు .. అందుకే సేఫ్ గేమ్ ఆడాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇకపై సక్సెస్ ఉన్న దర్శకులతోనే సినిమాలు చేయాలనీ నాని ప్రయత్నాలు సాగిస్తున్నాడట. ఇప్పటికే సక్సెస్ ఫుల్ దర్శకులతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుంది అన్న ఆసక్తి ఎక్కువైంది.
