పులి ఒక అడుగు వెనక్కి వేసిందంటే నాలుగు అడుగులు ముందుకి వేస్తుంది అన్న సామెతను మనం బాగానే వింటుంటాం నిత్యం. ఇప్పుడు అదే సామెత కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కు అన్వయించుకోవచ్చు. చెన్నై ఎక్స్ ప్రెస్ తర్వాత నిఖార్సైన విజయం లేని షారుఖ్ ఈ ఏడాది రెండు భారీ బ్లాక్ బస్టర్లు సాధించి తనను ఎందుకు బాద్షా అంటారో మరోసారి నిరూపించాడు.
షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ ఈ ఏడాది జనవరిలో విడుదలై షారుఖ్ కెరీర్ లోనే సూపర్బ్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు జవాన్ తో దాన్ని బీట్ చేసాడు ఖాన్. ఇలా ఒకదాన్ని మించిన మరో భారీ విజయంతో షారుఖ్ తిరిగి టాప్ ప్లేస్ లో సాధించాడు.
ఇంకా ఖాన్ ఆట ఈ ఏడాది పూర్తవ్వలేదు. షారుఖ్ నటించే డంకి చిత్రం డిసెంబర్ లో విడుదలవుతుంది. క్లాసిక్ చిత్రాలకు పెట్టింది పేరైన రాజ్ కుమార్ హిరానీ దీనికి దర్శకుడు. మరి ఈ చిత్రంతో షారుఖ్ హ్యాట్రిక్ కొడతాడేమో చూడాలి.