కీర్తి భట్.! బుల్లితెర నటీమణి.! ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్‌లో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు. చేతి వేలికి గాయం కారణంగా ఫిజికల్ టాస్కుల్లో తేలిపోతోంది. అర్థం పర్థం లేని కారణాలతో ఆమెను మిగతా హౌస్ మేట్స్ పక్కన పెడుతున్నమాట కూడా వాస్తవం.
కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ వచ్చినా, ఇంకో సందర్భంలో అయినా, సిల్లీ రీజన్స్‌తో కీర్తి భట్‌ని ముందుకు నడవనీయకుండా చేస్తున్నారు మిగతా కంటెస్టెంట్లు. అదే సమయంలో, కీర్తి భట్ అంటే తమకెంతో ఇష్టమంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. శ్రీసత్య ఏ స్థాయిలో కీర్తి భట్‌ని ర్యాగింగ్ చేస్తోందో చూస్తున్నాం. శ్రీహాన్ కూడా అంతే. ఇంకోపక్క, కీర్తి భట్ కూడా ఎమోషనల్ అవుతూ, తనపై సింపతీ వర్షం కురిసేలా చేసుకుంటోంది.
హోస్ట్ అక్కినేని నాగార్జున కూడా కొంతమేర కీర్తి భట్ విషయంలో సింపతీ కురిసేలానే చేస్తున్నాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు.. హౌస్‌మేట్స్‌ని కలిసే క్రమంలో కుటుంబ సభ్యులెవరూ లేని కీర్తి భట్ కోసం, సీరియల్స్‌లో కోస్టార్‌గా పనిచేసిన మహేష్ అనే వ్యక్తిని తీసుకొచ్చారు. అది ఓ రకంగా మంచి మైలేజ్ ఇచ్చింది కీర్తికి.
తాజా ఎపిసోడ్‌లో సినీ నటి, బిగ్ బాస్ రియాల్టీ షోలో గతంలో కంటెస్టెంట్‌గా సందడి చేసిన వితిక షెరు కూడా, కీర్తి భట్ గురించి నాలుగు మంచి మాటలు చెప్పింది. అదీ హోస్ట్ అక్కినేని నాగార్జున సాక్షిగా.. అది కూడా బిగ్ బాస్ స్టేజీ మీద నుంచే.
అయితే, ఈ తరహా సింపతీ, ఈ తరహా పొగడ్తలు.. ఇవే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవడానికి అర్హతలనుకుంటే పొరపాటే. జస్ట్ షోకి మైలేజ్ తెప్పించడం కోసం ఈ తరహా హంగామా కావాలనే డిజైన్ చేస్తుంటారు బిగ్ బాస్ నిర్వాహకులు. కీర్తి భట్ విషయంలోనూ అదే జరుగుతోందేమో.!
టైటిల్ ఎవరికి.? అన్నదానిపై ఇప్పటికే నిర్ణయం జరిగిపోయి వుండొచ్చు. మరి, ఎందుకీ అనవసరపు హంగామా.? అంటే, వీక్షకుల్ని వెర్రి వెంగళప్పల్ని చెయ్యాలి కదా.? ఓటింగ్ పేరుతో దండుకోవాలి కదా.?