Switch to English

ఏపీలో టీడీపీ పరిస్థితే తెలంగాణలో టీఆర్ఎస్‌కి వస్తుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

2014 నుంచి 2018 వరకు టీడీపీ – బీజేపీ కలిసే వున్నాయ్. 2018 నుంచి కథ మొదలైంది. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు నినదించడం మొదలు పెట్టారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. చివరికి తెలుగుదేశం పార్టీ దారుణంగా నష్టపోయింది. పోనీ, బీజేపీ ఏమన్నా బాగుపడిందా.? అంటే అదీ లేదాయె. మధ్యలో వైసీపీ లాభపడింది.

తెలంగాణలో ఏం జరగబోతోంది.? బీజేపీతో తెలంగాణ రాష్ట్ర సమితి అంటకాగిందనలేంగానీ, అంశాల వారీగా బీజేపీకి గతంలో టీఆర్ఎస్ అండగా నిలుస్తూ వచ్చింది. కానీ, ఎక్కడో తేడా కొట్టేసింది. గత కొంతకాలంగా, ప్రధాని నరేంద్ర మోడీ మీదా, బీజేపీ మీదా కేసీయార్ విరుచుకుపడుతున్నారు.

సేమ్ టు సేమ్.. ఏపీ ప్రజల్ని మోడీ మీదకి చంద్రబాబు ఎలా ఉసిగొల్పారో, అలాగే కేసీయార్ కూడా మోడీ మీదకి తెలంగాణ సమాజాన్ని ఉసి గొల్పుతున్నారు. ఇదంతా చూస్తోంటే, తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అత్యంత ఘోర పరాజయాన్ని చవిచూడబోతోందని, ఏపీలో టీడీపీ పరిస్థితిని బట్టి అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

అయితే, ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాజకీయాల మధ్య చాలా వ్యత్యాసం వుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం రూపంలో అప్పట్లో బలమైన వైసీపీ వుంది. బీజేపీ నామమాత్రమే అయ్యింది. తెలంగాణలో అలా కాదు. బీజేపీనే ఇప్పుడు బలమైన రాజకీయ శక్తి. ఆ బీజేపీ మీద కేసీయార్ యుద్ధం చేస్తున్నారు. చిత్రంగా ప్రధాన ప్రతిపక్షం అనదగ్గ కాంగ్రెస్ పార్టీ నీరుగారిపోయింది.

తెలంగాణలో బీజేపీ బలపడుతున్నా, అధికారంలోకి వచ్చేస్థాయి బలం ఆ పార్టీకి వుంటుందా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. మరోపక్క, కాంగ్రెస్ తెలంగాణలో దాదాపు గల్లంతయ్యింది. మజ్లిస్ సాయం వుంటుంది గనుక, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపు నల్లేరు మీద నడక లాంటిదే కావొచ్చు.

కానీ, రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు అనూహ్యంగా మారిపోతాయ్. అలా మారిపోయే ఈక్వేషన్స్, తెలంగాణ రాష్ట్ర సమితిని నిండా ముంచేస్తే.? ఏమో, గుర్రం ఎగరావచ్చు.. బీజేపీ అధికారంలోకి రానూ వచ్చు.

104 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

రాజకీయం

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

ఎక్కువ చదివినవి

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని (Naveen Yerneni) పేరు వెలుగులోకి వచ్చింది....

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...

వివేకం: వైఎస్ విమలారెడ్డి వర్సెస్ షర్మిల శాస్త్రి.!

వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.!...

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...