Switch to English

పవన్ కళ్యాణ్‌తో కాపులు జర జాగ్రత్త.! అదండీ సంగతి.!

91,429FansLike
56,274FollowersFollow

కాపు సామాజిక వర్గం అంతా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంట వెళుతుందని అధికార వైసీపీ భయపడుతోంది. ఆ విషయం కాపు మంత్రుల మాటలతోనే స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ విషయమై చాలా చాలా ఆందోళన చెందుతున్నారు.

‘కాపుల ఓట్లను టీడీపీకి వేయించాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారు..’ అంటూ వైసీపీ అధినేత తాను వ్యాఖ్యానించడమే కాకుండా, వైసీపీకి చెందిన కాపు ముఖ్య నేతలతోనూ అవే వ్యాఖ్యలు చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిలో వుండి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇలా కులాల పంచాయితీని తెరపైకి తీసుకురావడం ఎంతవరకు సబబు.?

పవన్ కళ్యాణ్ మాత్రం కాపుల గురించి ప్రస్తావించకూడదు, అలా ప్రస్తావిస్తే.. ఆయనకు కులగజ్జి వున్నట్లు. వైసీపీ నేతలు, ముఖ్యమంత్రి సహా.. కాపుల ప్రస్తావన తీసుకు రావొచ్చు, కాపుల పేరుతో రాజకీయాలు చేయొచ్చు.. అదే కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా, దానికి ‘కులాన్ని’ ఆపాదించేస్తుంటారు.

‘పవన్ కళ్యాణ్‌తో కాపులు జాగ్రత్తగా వుండాలి..’ అంటూ వైసీపీ కాపు సామాజిక వర్గాన్ని హెచ్చరిస్తోంది. ఔను, పవన్ కళ్యాణ్ గనుక ముఖ్యమంత్రి అయితే, కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి దక్కుతుంది. అలా దక్కకూడదు కాబట్టి, ఈ విషయంలో కాపు సామాజిక వర్గం అప్రమత్తంగా వుండాలంటూ కాపు సామాజిక వర్గానికే చెందిన వైసీపీ నేతలు చెప్పదలచుకుంటున్నట్టుంది.

కమ్మ సామాజిక వర్గం నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వొచ్చు.. కమ్మ సామాజిక వర్గమంతా చంద్రబాబు వెంట నడవొచ్చు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అవ్వొచ్చు.. రెడ్డి సామాజిక వర్గం అంతా ఆయన వెంట నడవొచ్చు.. కానీ, కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవకూడదు. కాపులెవరూ పవన్ కళ్యాణ్ వెంట నడవకూడదు.!

కాపు సామాజిక వర్గం ఇక్కడే ఆత్మవిమర్శ చేసుకోవాలి. కాపు సామాజిక వర్గంలో ఎందుకు చీలిక వస్తోందన్నదానిపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది ఆ సామాజిక వర్గానికి చెందినవారే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘నవాబ్’ మూవీ కోసం 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర,...

‘లెహరాయి’ నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్...

అందం కోసం బుట్టబొమ్మ సర్జరీపై క్లారిటీ

హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం...

బాబోయ్‌ రష్మిక మరీ అంత పెంచేసిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో కొన్ని ఆఫర్స్ ని ఈమె కాదన్నట్లుగా...

బిగ్‌బాస్‌ 6 : ఆ సర్వే టాప్‌ 5 లో శ్రీసత్య

ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఓర్మాక్స్ వారు ప్రతివారం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యే సెలబ్రెటీల జాబితాను ప్రకటిస్తూ ఉంటారు. సోషల్‌ మీడియాలో ఎక్కువగా ఎవరి...

రాజకీయం

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని...

అమరావతి రైతుల పాదయాత్ర: మంత్రుల బెదిరింపులు.! జనం బేఖాతర్.!

రాజధాని అమరావతి విషయంలో మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారు. అమరావతి నుంచి అరసవెల్లికి జరుగుతున్న మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్థాయిలో, పార్టీ స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అవి సఫలం...

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

‘జ..గన్’ అంటోన్న రోజా.! ‘గన్..జా’ అంటోన్న టీడీపీ.! అసలేంటి కథ.?

ఆడ పిల్లకి అన్యాయం జరిగితే, గన్ కంటే ముందుగా జగన్ అక్కడ వుంటాడంటూ పదే పదే వైసీపీ నేత రోజా చెప్పడం చూశాం. ఎమ్మెల్యేగా వున్నప్పటినుంచీ ఆమె ఇవే మాటలు చెబుతూ వస్తున్నారు....

మొగల్తూరు రాజకీయం.! ప్రభాస్, చిరంజీవి.. అసహనం వ్యక్తం చేసిన వేళ.!

‘మరీ ఇంత నీఛానికి దిగజారుతారా.?’ అన్న చర్చ సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖుల మధ్య జరుగుతోంది. సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి, దివంగత కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమం ఆయన సొంతూరులో నిర్వహించిన...

ఎక్కువ చదివినవి

వరల్డ్స్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌ ముందు ‘నాటు నాటు’ రచ్చ.. ఇది మన సినిమా సత్తా

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి కొన్ని నెలల క్రితం ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో గుర్తింపులను.. గౌరవాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా బియాండ్...

కృష్ణంరాజు సంస్మరణ సభలో ప్రభాస్ చేయించిన వంటల లిస్ట్‌ ఇదిగో.. క్వింటాల్లో కాదు టన్నుల్లో!

కృష్ణంరాజు మరణ వార్త ప్రతి ఒక్కరిని కలచి వేసింది. ఆయన మృతి చెందిన సమయంలోనే సొంత ఊరు మొగల్తూరు లో భారీ ఎత్తున సంస్మరణ సభ నిర్వహించాలని భావించారు. కాస్త ఆలస్యంగా సంస్మరణ...

వైకాపా రోజా సూపర్ ప్లాన్‌.. రెబల్‌ స్టార్ ఫ్యాన్స్‌ ఆకర్షించేందుకా?

రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ నేడు మొగల్తూరులో భారీ ఎత్తున జరిగిన విషయం తెలిసిందే. ఆ సంస్మరణ సభకు ఏపీ ప్రభుత్వం నుండి టూరిజం మంత్రి ఆర్కే రోజా, చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ...

బిగ్‌ బాస్ 6 గీతూ రాయల్‌ గురించి ఆసక్తికర విషయాలు

బిగ్ బాస్ సీజన్ 6 హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన గలాట గీతూ రాయల్ జీవితం ప్రత్యేకమైంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని చివరకు విజయవంతమైన జీవితాన్ని గడుపుతోంది. టిక్ టాక్ స్టార్ గా...

రాజమౌళి దర్శకత్వంలో చేయాలి అని లేదు : చిరంజీవి

మెగాస్టార్ తో దర్శకదిగ్గజం రాజమౌళి సినిమా చేస్తే... ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అందరూ ఊహించుకోవచ్చు. అభిమానులు కూడా ఈ సినిమా పట్టాలెక్కితే చూడాలని చాలా ఆశతో వున్నారు. అయితే...