ఈ వారం ఎలిమినేట్ అయిన గీతూ రాయల్ తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందా అనే చర్చే ఎక్కువగా నడుస్తోంది… కారణం.. ఎక్కువ మంది ప్రేక్షకులు.. గీతూ రాయల్ ఎలిమినేషన్ ను అప్పుడే ఊహించలేదు.. గీతూ ఎలిమినేట్ అయిన బిగ్ బాస్ ఎపిసోడ్ ను మున్నెన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో ఎక్కువ మంది వీక్షించినట్టుగా నిర్వాహకులు ప్రకటించటం గమనార్హం..
ఇంతకుముందు ఏ ఇంటి సభ్యలు బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇంత డ్రామా పండలేదనే చెప్పాలి. గీతూ విలపించటం సహజంగా అనిపించి.. ప్రేక్షకులకు సానుభూతి కలిగిందని తెలుస్తోంది…
కేవలం ప్రేక్షకులే కాకుండా .. ఎప్పుడూ కఠినంగా కనబడే రేవంత్ సహా.. ఇంటిలోని మిగతా సభ్యులు అందరూ గీతూ కోసం విలపించటంతో.. ఈ ఎపిసోడ్ ప్రత్యేకంగా క్లిక్ అయింది.. ఈ ఎపిసోడ్ కు వచ్చిన రెస్పాన్స్ పట్ల నిర్వాహకులు సంతోషంగా ఉన్నట్లు తెలిసింది..
అయితే.. ఇంతలా పేరు తెచ్చుకున్న గీతూ రాయల్ మరలా హౌస్ కి వస్తుందా అని కొందరు ఎదురు చూస్తున్నారు కూడా. ఈరోజు జరిగిన 66వ ఎపిసోడ్ లో.. అందరికన్నా తెలివైన వాడిగా నాగ్ దగ్గర మార్కులు ఉన్న గట్టి పోటీదారు సభ్యుడు , ఆదిరెడ్డి కూడా.. గీతూ ఏదో సీక్రెట్ రూమ్ లోనే ఉండొచ్చని, మళ్లీ రావచ్చని.. బిగ్ బాస్ తో ముచ్చటించాడు .
అది ఎంత వరకు నిజమో పక్కన పెడితే.. గీతూ రాయల్ ఈ ఆదివారం నాడు తన సొంత ఇంటికి రావడం, ఆమె ఇంటర్వ్యూ ల కోసం మీడియా వారు.. ఆమె నివాసానికి రావడం కూడా జరిగింది…
ఇదిలా ఉండగా.. ఫైనల్ లో విజేత గా ఎవరు నిలుస్తారు అన్నది.. ఇప్పుడిప్పుడే సమీకరణాలు మొదలయ్యాయని చెప్పవచ్చు.. ఈ చర్చ హౌస్ లో కూడా ఈరోజు ఎపిసోడ్ లో నడిచింది.. ఇంటి సభ్యుడు రోహిత్… ”ఈసారి ఆదిరెడ్డి బిగ్ బాస్ విజేత అయ్యే అవకాశాలు ఉన్నాయని” అభిప్రాయపడటం కొసమెరుపు.