వైకాపా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు మెజార్టీ సీట్లు ఇచ్చామని.. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా బీసీలకు మెజార్టీ సీట్లు ఇస్తూ వారికి గౌరవంను గుర్తింపును ఇవ్వడంతో పాటు వారి అభివృద్దికి తోడ్పాటును అందిస్తున్నట్లుగా వైకాపా నాయకులు మాట్లాడుతున్నారు. తాజాగా కూడా వైకాపా బీసీలకు రెండు ఎంపీ సీట్లు ఇవ్వడం వల్ల కులాల రాజకీయాలు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయం లేకుండా ఏ పార్టీ కూడా రాజ్యసభ సీట్ల విషయంలో నిర్ణయాలు తీసుకోరు. వైకాపా ఇద్దరు బీసీలకు అది కూడా తెలంగాణ బీసీకి సీటు ఇవ్వడం అంటే ఖచ్చితంగా రాజకీయం.. బీసీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఇలా సీట్లు ఇచ్చినంత మాత్రాన వైకాపా ను జనాలు నమ్ముతారా అంటే ఏమో చెప్పలేం అనే సమాధానం వినిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో వైకాపా పై వ్యతిరేకత ఉంటే మాత్రం ఈ బీసీ గాలం పెద్దగా పని చేయక పోవచ్చు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.