Switch to English

ఇలా చేస్తే, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కూడా వస్తుందేమో.!

‘కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.. రైతుల్ని ఉద్ధరించడానికే ఆ చట్టాలు.. విపక్షాలు కుట్రపూరిత రాజకీయం చేస్తున్నాయ్..’ అంటూ మేకపోతు గాంభీర్యం చాన్నాళ్ళు ప్రదర్శించిన కమలదళం ఇప్పుడు తోకముడిచింది. ప్రధాని నరేంద్ర మోడీ, కొత్త వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

రాజకీయాల్లో అసాధ్యమన్నది ఏదీ వుండదు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల్ని ప్రజలు తిరస్కరిస్తే.. ఏ ప్రభుత్వమైనా ఎందుకు దిగిరాకుండా వుంటుంది.? ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయంలో అయినా ఇంతే. రైతు చట్టాల విషయంలో రైతులు చూపించిన పోరాట పటిమ, ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూపించగలిగితే, ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది.

కానీ, ఆంధ్రప్రదేశ్‌కి పెద్ద శాపం.. రాష్ట్రంలో రాజకీయ శక్తులు. ప్రధానంగా ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. భారతీయ జనతా పార్టీతో తెరవెనుకాల చెట్టాపట్టాలేసుకు తిరుగుతూ ప్రత్యేక హోదాకి పాతరేశాయి. ఈ రెండు పార్టీలకీ ప్రత్యేక హోదా అంటే కేవలం ఎన్నికల స్టంటు మాత్రమే.

అధికార వైసీపీ, ఇప్పుడు తమ ఎంపీలతో రాజీనామా చేయించి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే.. దానికి తెలుగుదేశం పార్టీ కూడా మద్దతిస్తే.. ఆటోమేటిక్‌గా రాష్ట్రంలోని మిగతా పార్టీలు కూడా ప్రత్యేక హోదా విషయంలో అధికార పార్టీతో కలిసి నడిచేందుకు ముందడుగు వేస్తాయి.

కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి అంత చిత్తశుద్ధితో కూడిన రాజకీయాల్ని ఆశించలేం. రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ అంతలా భ్రష్ట్టుపట్టిపోయింది. ప్రత్యేక హోదా పేరుతో తమ పరపతి పెంచుకోవడానికి వైసీపీ గతంలో తమ ఎంపీలతో రాజీనామా చేయించింది. అధికారం పోతుందేమోనన్న భయంతో ధర్మ పోరాట దీక్షల పేరుతో ప్రత్యేక హోదా కోసం అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉద్యమించారు. అవన్నీ బూటకపు పొలిటికల్ డ్రామాలుగానే మిగిలిపోయాయ్.

ఇప్పుడైనా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు వస్తే.. ప్రత్యేక హోదాపైనా, రైతుల ఉద్యమం తరహాలో పోరుబాట పడితే.. ప్రత్యేక హోదాపై కేంద్రం దిగిరాకుండా వుంటుందా.? వచ్చి తీరుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఏపీలో నైట్ కర్ఫ్యూ వెనక్కు.. పండగే కారణం

ఆంద్ర ప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా కరోనా కేసుల కట్టడిలో భాగంగా నైట్‌ కర్ఫ్యూను అమలు చేయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. సంక్రాంతి ముందు ఇలాంటి కర్ఫ్యూ...

పవన్‌ వీరమల్లు షూటింగ్ లో జాయిన్‌ అయ్యేది ఎప్పుడంటే..!

పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి విడుదల కు...

టీడీపీకి సినిమా పరిశ్రమ ఎప్పుడు సహకరించలేదు

టాలీవుడ్‌ కు చెందిన ప్రముఖులు తెలుగు దేశం పార్టీకి సహకరిస్తున్నారు.. వారికి కనీసం ఏపీ రాష్ట్రం ఉంది అని కాని.. సీఎంగా జగన్‌ మోహన్‌ రెడ్డి...

ప్రాజెక్ట్‌ కే విడుదలపై ఓ పుకారు

ప్రభాస్‌ నటించిన రాధే శ్యామ్‌ విడుదలకు సిద్దంగా ఉంది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ లో రూపొందిన రాధే శ్యామ్ ను సంక్రాంతికి విడుదల చేయాలని భావించినా...

తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకొంటున్న శివాని రాజశేఖర్

రాజశేఖర్ లేటెస్ట్ గా శేఖర్ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమాను మొదట సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు కానీ కోవిడ్ పాజిటివ్ కేసులు బాగా...

రాజకీయం

ఏపీ వైసీపీ నేతలకు కోవిడ్ వస్తే, హైద్రాబాద్ పరిగెడుతున్నారెందుకు.!

అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించేశామని వైసీపీ చెప్పుకుంటోంది. కరోనా నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైద్రాబాద్‌కే పరిమితమైపోయారన్న వైసీపీ విమర్శల సంగతి సరే సరి....

చంద్రబాబు వన్ సైడ్ లవ్ పై పవన్ కల్యాణ్ స్పందన

ఇతర పార్టీలతో పొత్తు అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. పార్టీ కార్య నిర్వాహక సభ్యులతో పవన్ మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటివల చంద్రబాబు చేసిన వన్...

యూపీలో బీజేపీ గట్టి దెబ్బ.. ఎస్పీలోకి మంత్రి ఎమ్మెల్యేలు జంప్‌

ఉత్తరప్రదేశ్‌ లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు గాను అఖిలేష్ యాదవ్‌ పార్టీ అయిన సమాజ్ వాది పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ కి అత్యంత కీలకమైన ఉత్తర ప్రదేశ్...

చిరంజీవి ప్రజారాజ్యంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవిపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టకుంటే ఆనాడే అధికారంలోకి వచ్చేవాళ్లమని అన్నారు. చిరంజీవి పార్టీ పెట్టకముందు, తర్వాత కూడా తనతో బాగానే...

బులుగు జర్నలిజం: నష్టమొస్తే సినిమాలెందుకు తియ్యాలి.?

సినిమా అంటే వ్యాపారం.. విజయవంతమైన సినిమాల విషయానికొస్తే, 2 శాతం వరకు మాత్రమే వుంటుంది.. అలాంటప్పుడు, నష్టాల్లో సినిమా వ్యాపారమెందుకు చెయ్యాలి.? అంటూ బులుగు జర్నలిజం ఓ అద్భుతమైన ప్రశ్న సంధించేసింది. దాంతో,...

ఎక్కువ చదివినవి

ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు..! షెడ్యూల్ విడుదల చేసిన సీఈసీ

అయిదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల నగారా మోగింది. పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. అయిదు రాష్ట్రాల్లోని మొత్తం 690 స్థానాలకు ఫిబ్రవరి...

హాట్ పిక్ టాక్: దిశా పటాని కెవ్వు కేక బాబోయ్!!

ఎప్పటికప్పుడు తన హాట్ అందాలతో తన ఫాలోయర్స్ ను అప్డేట్ చేస్తూ దూసుకుపోతోన్న దిశా పటాని ఈసారి మరో మెరుపు పోస్ట్ తో అందరికీ సెగలు పుట్టించింది. ఆమె అప్లోడ్ చేసిన రీసెంట్...

ప్రాజెక్ట్‌ కే విడుదలపై ఓ పుకారు

ప్రభాస్‌ నటించిన రాధే శ్యామ్‌ విడుదలకు సిద్దంగా ఉంది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ లో రూపొందిన రాధే శ్యామ్ ను సంక్రాంతికి విడుదల చేయాలని భావించినా కూడా కరోనా వల్ల సాధ్యం కాలేదు....

వారసుడు కాదు, కాలకేయుడు.! దొరకని దుర్మార్గుల మాటేమిటి.?

ఈ అరాచకం ఇప్పుడు మొదలైంది కాదు.. ఏళ్ళు గడిచిపోయాయ్.. బాధితులు పదుల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో వున్నారు.! తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవ గురించి...

రాశి ఫలాలు: శనివారం 08 జనవరి 2022

పంచాంగం శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం సూర్యోదయం: ఉ 6:37 సూర్యాస్తమయం : సా‌.5:37 తిథి: పుష్య శుద్ధ షష్ఠి సా.3:40 నిమిషాల వరకు తదుపరి పుష్య శుద్ధ సప్తమి సంస్కృతవారం: స్థిరవాసరః (శనివారం) నక్షత్రము...