యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అనుష్క ల మధ్య స్నేహం కాదు ప్రేమ ఉందని చాలా మంది బలంగా నమ్ముతారు. అది నిజం అవ్వాలని వారి అభిమానులు కూడా కోరుకుంటారు. కానీ పలు సందర్భాల్లో అనుష్క మరియు ప్రభాస్ లు వేరు వేరుగా తాము కేవలం స్నేహితులం మాత్రమే అన్నట్లుగా చెప్పుకొచ్చారు. వారు ఎంతగా చెప్పినా వారి ప్రేమ విషయాన్ని ఎంత కవర్ చేయాలని చూసినా జనాలు మాత్రం వారి మధ్య ఉన్నది ప్రేమే అంటూ బలంగా నమ్ముతున్నారు.
ఒకవేళ ప్రేమ లేకుంటే ఇకనైనా వారు ప్రేమించుకోవాలంటూ కోరుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమకి ప్రత్యక్ష సాక్ష్యం అన్నట్లుగా ఎన్నో వీడియోలు, ఫోటోలు ఉన్నాయి. ఇటీవల రెబల్ స్టార్ కృష్ణంరాజు చనిపోయిన సందర్భంగా అనుష్క సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టిన విషయం తెలిసింది. కేవలం పోస్ట్ పెట్టి వదిలేయకుండా ఆమె హైదరాబాద్ కి వచ్చి ఆ సమయంలో ప్రభాస్ వెంట నిల్చుని ఆయన్ని ఓదార్చిందట.
ఒకరోజు కాదు రెండు రోజులు కాదు మూడు నాలుగు రోజుల పాటు ప్రభాస్ కి ఓదార్పుగా అనుష్క తోడు ఉందట. ఈ విషయం కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు కూడా తెలుసు, వారు గతంలోనే వీరి వ్యవహారం గురించి తెలుసుకున్నారట. ఈ విషయాలన్నిటినీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్టు రామారావు చెప్పుకొచ్చాడు. వారిద్దరూ ఇప్పుడు కాకుండా మరికొన్నాళ్లకైనా పెళ్లి చేసుకుంటారు అంటూ ఆయన చాలా నమ్మకంగా చెప్తున్నాడు.
కేవలం మొన్న కృష్ణంరాజు చనిపోయినప్పుడు మాత్రమే కాకుండా పలు సందర్భాల్లో వాళ్ళు కలుస్తూనే ఉంటారని ఎన్నో సార్లు కలిసి విదేశాలకు వెళ్లారని ఆయన ఇంటర్వ్యూలు పేర్కొన్నాడు. ప్రభాస్ గురించి అనుష్క ని ఏదైనా ప్రశ్న అడిగిన సందర్భంలో ఆమె ముసి ముసిగా నవ్వుతూ సిగ్గుపడుతూ సమాధానం చెప్తుందని, అదేవిధంగా ప్రభాస్ కూడా అనుష్క గురించి మాట్లాడినప్పుడు మొహం వెలిగిపోయినట్లుగా మాట్లాడతాడని ఆయన పేర్కొన్నాడు.
ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్న వాళ్లు కోట్లాది మంది ఉన్నారు, వాళ్లలో నేను కూడా ఒక్కడినే అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రేమ జంటలు ఉన్నా, వారి గురించి పెద్దగా చర్చ జరగదు. కానీ ప్రభాస్ అనుష్క ల మధ్య ఉన్న ప్రేమ గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది, కనుక వారిద్దరూ కచ్చితంగా నేడు రేపో కాకుండా భవిష్యత్తులో ఆయన పెళ్లి చేసుకొని అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తారేమో చూడాలి.
బాహుబలి తర్వాత అనుష్క సినిమాలను చూస్తే ప్రభాస్ హోం బ్యానర్ uv క్రియేషన్స్ లో మాత్రమే చేస్తుంది. అది కూడా అనుష్క మరియు ప్రభాస్ మధ్య అంతకు మించి ఏదో ఉంది అన్నట్లుగా నిరూపిస్తుందంటూ ఆయన తన మాటలు చెప్పుకు వచ్చాడు. ఇంతకు ప్రభాస్ అనుష్క మధ్య ఏముంది అనేది కాలమే సమాధానం చెప్పాలి.
27470 591669Hey there! Excellent stuff, do keep us posted when you lastly post something like that! 45648
375431 957401superb post. Neer knew this, appreciate it for letting me know. 275282