మెగాస్టార్ చిరంజీవి తాజా బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగా 158 సినిమాను పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించేందుకు ప్లానింగ్ జరుగుతోందని సినీ వర్గాలు అనుకుంటున్నాయి. ఈ సినిమాతో చిరంజీవిని మరోసారి పవర్‌ఫుల్ అవతార్‌లో చూపించబోతున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది.
ఈ సినిమా విషయంలో ఇప్పుడు ఎక్కువగా చర్చకు వస్తున్నది హీరోయిన్ ఎంపిక. చిరంజీవి సరసన మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ నటించబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో పలుమార్లు ఈ కాంబినేషన్ ప్రయత్నాలు జరిగినా వర్కౌట్ కాలేదని, కానీ ఈసారి కథ, పాత్ర బలంగా ఉండటంతో ఐశ్వర్య కూడా సానుకూలంగా స్పందించినట్టు ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే, ఇదే ఆమె తొలి పూర్తి స్థాయి తెలుగు సినిమా అవుతుందని టాక్.
ఇక ఐశ్వర్య రాయ్ రెమ్యునరేషన్ అంశం కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం ఆమె దాదాపు రూ.20 కోట్లకు పైగా పారితోషికం డిమాండ్ చేస్తున్నారని, షూటింగ్ సమయంలో ఆమె స్టే, సిబ్బంది ఖర్చులు కూడా నిర్మాతలే భరించాలనే షరతులు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ అన్ని విషయాలు కుదిరితేనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చని అంటున్నారు.
దీంతో పాటు మరో ఆసక్తికర విషయం కూడా వినిపిస్తోంది. ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్ కీలక పాత్రలో కనిపించనున్నారన్న టాక్ ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. చిరంజీవి – మోహన్‌లాల్ కాంబినేషన్ అంటేనే పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉంటుందని, ఈ ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు అదనపు బలంగా మారుతుందని అభిమానులు అనుకుంటున్నారు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంతో సాగే కథలో మోహన్‌లాల్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది.
అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా, ఐశ్వర్య రాయ్ హీరోయిన్‌గా, మోహన్‌లాల్ కీలక పాత్రలో ఉంటే మెగా 158 సినిమాపై అంచనాలు నెక్ట్స్ లెవల్‌కు వెళ్లడం ఖాయమని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.
