Switch to English

ప్రత్యక్ష రాజకీయాల్లోకి హీరో నారా రోహిత్‌.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

యంగ్‌ హీరో నారా రోహిత్‌.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నాడట. చంద్రబాబు సోదరుడి కుమారుడైన నారా రోహిత్‌, నిజానికి.. చాలాకాలం క్రితమే రాజకీయాల్లోకి రావాల్సి వుంది. అయితే, అత్యంత చాకచక్యంగా సోదరుడి కుమారుడ్ని సినిమాల్లోకి పంపిన చంద్రబాబు, తన కుమారుడు నారా లోకేష్‌ని వ్యూహాత్మకంగా రాజకీయాల్లోకి లాక్కొచ్చారు. అయితే, ప్రత్యక్ష రాజకీయాల్లో నారా లోకేష్‌ నానా తంటాలూ పడాల్సి వస్తోంది.

తెరవెనుక రాజకీయాలు నడపడంలో దిట్ట అయినప్పటికీ, మీడియా ముందు మాట్లాడటం సహా, ఇతరత్రా విషయాల్లో లోకేష్‌ పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలోనే లోకేష్‌కి మద్దతుగా నారా రోహిత్‌ని రాజకీయాల్లోకి తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నారట. ఇది ఓ రకంగా టీడీపీని, తిరిగి నందమూరి కుటుంబం చేతుల్లోకి వెళ్ళనీయకుండా చేసే వ్యూహమన్న వాదనలూ లేకపోలేదు.

టీడీపీ పగ్గాలు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ చేపట్టాలన్నది నందమూరి అభిమానుల చిరకాల కోరిక. కానీ, చంద్రబాబు ఆ ఛాన్స్‌ యంగ్‌ టైగర్‌కి ఇచ్చే ప్రసక్తే లేదు. నందమూరి బాలకృష్ణ, టీడీపీలోనే వున్నా.. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నా.. పార్టీ కార్యకలాపాల విషయంలో ఆయన్ని చంద్రబాబు తెలివిగా దూరం పెట్టారు. బాలయ్యకి కూడా పార్టీ వ్యవహారాల పట్ల అంతగా ఆసక్తి లేదు. ప్రజా ప్రతినిధి అన్న ట్యాగ్‌తో బాలయ్య తన పని తాను చేసుకుపోతున్నారంతే. అయితే, సినిమాల్లోనే అంతంతమాత్రం ఇమేజ్‌ వున్న నారా రోహిత్‌, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి మాత్రం సాధించేదేముంటుంది.? అన్నది మరో చర్చ.

ఏమో, చంద్రబాబు రాజకీయ వ్యూహాలు ఎలా వున్నాయోగానీ, రోహిత్‌ మాత్రం.. రాజకీయాల్ని ఔపోసన పట్టే పనిలో అప్పుడే బిజీ అయిపోయారని తెలుస్తోంది. సోదరుడినే రాజకీయంగా ఎదగనివ్వని చంద్రబాబు, సోదరుడి తనయుడ్ని ఎగదోస్తున్నారంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఏదైనా, చంద్రబాబు ‘అవసరం’ మేరకే ‘వాడకాన్ని’ చేపడతారు. రోహిత్‌ ఈ విషయాన్ని గుర్తుంచుకుని రాజకీయ రంగ ప్రవేశం విషయమై జాగ్రత్తగా అడుగేస్తే మంచిదేమో.!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

ఎక్కువ చదివినవి

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Raadhika : నటి రాధిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Raadhika : సీనియర్ నటి రాధిక పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం తెల్సిందే. తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్‌ స్థానంను బీజేపీ నటి రాధిక కు ఇవ్వడం జరిగింది. గత కొంత...

Kamal Haasan: ‘కల్కి’లో తన పాత్ర రివీల్ చేసిన కమల్ హాసన్

Kamal Haasan: అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల సమయం కావడంతో రాజకీయాల్లోనూ నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా...

Ram Charan: హైదరాబాద్ లో ఘనంగా రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు..

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానులు కలిసి చేసిన ఈ వేడుకలో మంచు మనోజ్, నిఖిల్, కిరణ్ అబ్బవరం.. నిర్మాతలు దిల్...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది. మే 9న...