Switch to English

రాజధానిగా విశాఖ.. ఇప్పుడెందుకీ అత్యుత్సాహం.?

జ్యుడీషియల్‌ క్యాపిటల్‌గా మారాల్సిన కర్నూలు, కరోనా క్యాపిటల్‌గా మారిపోయింది. లెజిస్లేచర్‌ క్యాపిటల్‌ అంటోన్న అమరావతి కూడా కరోనా దెబ్బకు విలవిల్లాడుతోంది. మరి, ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ కావాల్సి వున్న విశాఖ పరిస్థితేంటి.? అక్కడా కరోనా కేసులు బాగానే నమోదయ్యాయి. అయితే, రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోల్చితే విశాఖ కాస్త బెటర్‌. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటిదాకా కరోనా పాజిటివ్‌ కేసులే లేకపోవడం ఆహ్వానించదగ్గ పరిణామం.

ఊరందరిదీ ఓ దారి అయితే, ఉలిపిరికట్టది ఇంకోదారి.. అన్నట్టుంది వైఎస్‌ జగన్‌ సర్కార్‌ పరిస్థితి. హడావిడిగా రాజధానిని విశాఖకు తరలించేందుకు నానా రకాల ప్రయత్నాలూ చేస్తోంది. ‘త్వరలో విశాఖకు రాజధాని వచ్చి తీరుతుంది.. దీన్ని ఎవడూ ఆపలేడు..’ అని ఈ మధ్యనే వైసీపీ ఎంపీ (రాజ్యసభ సభ్యుడు) విజయసాయిరెడ్డి మీసం మెలేసి, తొడగొట్టినంత పనిచేశారు. నిజానికి, విశాఖ రాజధాని వ్యవహారంలో విజయసాయి అత్యుత్సాహం అంతా ఇంతా కాదు. ఆయనే ఈ మొత్తం వ్యవహారానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

కానీ, న్యాయస్థానంలో మాత్రం ప్రభుత్వం ‘అబ్బే, ఇప్పుడు అలాంటి ఆలోచనలు ఏమీ చేయడంలేదు..’ అంటూ విన్నవించుకుంది రాజధాని తరలింపుకి సంబంధించిన కేసు విచారణలో. గతంలోనే న్యాయస్థానం, ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై ‘స్టే’ విధించినా, వైఎస్‌ జగన్‌ సర్కార్‌, కోర్టు ఆదేశాల్ని పెడచెవిన పెడ్తోందన్న విమర్శలున్నాయి. రాష్ట్ర వాస్తవ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుంటే, కొత్త రాజధాని.. మూడు రాజధానుల ప్రతిపాదన అనేవి అర్థ రహితమైన విషయాలుగానే కన్పిస్తాయి. కానీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆలోచనలు అందుకు భిన్నంగా వున్నాయి.

అమరావతి ప్రపంచస్థాయి నగరం అయ్యే అవకాశాలెంత.? అన్నది పక్కన పెడితే, రాజధానికి అవసరమైన సౌకర్యాలు కొంతమేర అక్కడ వున్నాయన్నది నిర్వివాదాంశం. ఏడాదిగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమరావతి నుంచే పరిపాలన చేస్తోంది. అలాంటప్పుడు, కొత్త రాజధాని అవసరమేంటి.? కరోనా దెబ్బకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో ఇంకా రాజధాని తరలింపు ఆలోచనలు చేయడమంటే, రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నట్టు.?

సినిమా

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రచయితపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు

ఎస్సీ ఎస్టీలను కించపర్చే విధంగా ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రాసిన పద్యం ఉంది అంటూ దళిత సంఘాల నేతలు మండి పడుతున్నారు. మడి కట్టుకుని ఉండటం...

మహేష్, పూరి మధ్య అంతా సమసిపోయిందా?

సాధారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు ఎవరైనా హిట్ అందిస్తే మళ్ళీ వాళ్లతో కలిసి పనిచేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తుంటాడు. కానీ దురదృష్టవశాత్తూ అలా...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

బిగ్ వార్: బాలయ్య వ్యాఖ్యలపై సి.కళ్యాణ్ పేస్ వేల్యూ లేదంటూ కౌంటర్ అటాక్.!

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా సినీ ప్రభుఖులంతా కలిసి మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి షూటింగ్స్, థియేటర్స్ ఓపెనింగ్స్ విషయంలో చర్చలు జరిపారు....

నాగబాబుపై పోలీసు కేసు నమోదు

ఈమద్య కాలంలో నాగబాబు మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్నాడు. ఆయన సోషల్‌ మీడియాలో చేస్తున్న కామెంట్స్‌ కారణంగా ఆయన రెగ్యులర్‌గా వార్తల్లో ఉంటున్నాడు. కొన్ని రోజుల క్రితం గాడ్సే గొప్ప దేశ భక్తుడు అంటూ...

బాలయ్య – ఎన్టీఆర్ కాంబో మూవీ.. సాధ్యమయ్యేనా?

నందమూరి బాలకృష్ణ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని నందమూరి అభిమానులు ఎప్పటినుండో ఆశగా ఎదురుచూస్తున్నారు కానీ అది ఇప్పటివరకూ సాధ్యమవ్వలేదు. బాలయ్య హీరోగా నటించిన కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల్లో...

మహేష్ సర్కారు వారి పాటకు కరోనా ఇబ్బంది

కరోనా వైరస్ కారణంగా సినిమా ఇండస్ట్రీ ఎంతలా నష్టపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే షూటింగ్స్, సినిమా రిలీజ్ లు లేక దాదాపు రెండున్నర నెలలు గడిచిపోగా ఒక్క టాలీవుడ్ కే...

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...