వైసీపీ రాజ్యసభ సభ్యుడు, వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన విజయ సాయి రెడ్డి మీద తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. మామూలు ఆరోపణలు కావివి, అత్యంత తీవ్రమైన ఆరోపణలు. తన భార్యకు పుట్టిన బిడ్డకు తండ్రి విజయ సాయి రెడ్డేనంటూ ఓ వ్యక్తి పోలీసుల్ని ఆశ్రయించారు. డీఎన్ఏ పరీక్షలు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారాయన.
మరోపక్క, విజయ సాయి రెడ్డి మాత్రం, మీడియా ముందుకొచ్చి.. కొన్ని మీడియా సంస్థలపైనా, కొందరు జర్నలిస్టులపైనా గుస్సా అయ్యారు. ఈ మొత్తం వ్యవహారం వైసీపీ మెడకు గట్టిగానే చుట్టుకునేలా కనిపిస్తోంది.
తన మీద కుట్ర జరుగుతోందంటూ సొంత పార్టీ మీద కూడా విజయ సాయి రెడ్డి అనుమానాలు వ్యక్తం చేయడం ఆసక్తికరమైన విషయం. ఇంత జరుగుతున్నా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఈ మొత్తం వ్యవహారంపై స్పందించకపోవడమేంటి.?
స్పందించలేదు సరికదా, విజయ సాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినరోజే ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలి, బెంగళూరుకి వెళ్ళిపోయారు. మరోపక్క, విజయ సాయి రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి కూడా ప్రెస్ మీట్ పెట్టడం ఆసక్తికర పరిణామం.
విజయ సాయి రెడ్డి తన కాపురంలో చిచ్చు పెట్టారనీ, తన భార్యను లోబర్చుకుని, ఆమెకు పుట్టిన బిడ్డకు తండ్రయ్యాడనీ సంచలన ఆరోపణలు చేస్తూ, అందుకు తగ్గ ఆధారాల్ని బయటపెడుతున్నారు బాధిత భర్త.
తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది పోయి, మీడియా మీద కస్సుబుస్సులాడుతున్న విజయ సాయి రెడ్డి వ్యవహారంపై పార్టీలోనూ ఆందోళన వ్యక్తమవుతోందిట. విజయ సాయి రెడ్డి దగ్గర, వైసీపీకి చెందిన కొందరు నేతల ‘భంచిక్’ వీడియోలున్నాయనే ప్రచారం కొత్తగా తెరపైకొచ్చింది.
అదే సమయంలో, విజయ సాయి రెడ్డి ‘వ్యవహారాలకు’ సంబంధించిన వీడియోలు, వైసీపీలోని కొందరు ముఖ్య నేతల వద్ద వున్నాయనే గుసగుసలూ వినిపిస్తున్నాయి.