Switch to English

వాలంటీర్ల వ్యవస్థ ఉన్నా.. రేషన్ పరేషాన్ ఏల?

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థ ఈ విపత్కర సమయంలో అక్కరకు రావడంలేదా? కరోనాను నిరోధించాలంటే భౌతిక దూరం పాటించాల్సిన సమయంలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కోసం జనాలు క్యూలో నిల్చునే పరిస్థితి ఎందుకు వచ్చింది? 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను ఏర్పాటు చేసినా.. రేషన్ వారి చేత ఎందుకు పంపిణీ చేయించలేకపోతున్నారు? ప్రస్తుతం ఇవీ పలువురిని వేధిస్తున్న ప్రశ్నలు.

నిజానికి జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థ చాలా మంచి ఫలితాలనే ఇస్తోంది. పలు రాష్ట్రాలు దీనిపై మక్కువ కూడా చూపిస్తున్నాయి. ఒక్కో వాలంటీర్ కు 50 ఇళ్లు కేటాయించడం వల్ల వారికి సంబంధించిన అన్ని విషయాలతోపాటు క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఏమిటనేది ప్రభుత్వానికి సులభంగా తెలుస్తుంది. దానికి తగినట్టుగా సర్కారు నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవస్థపై కేరళ వంటి రాష్ట్రాలు కూడా ఆసక్తి ప్రదర్శించాయి.

ప్రజలు ఏ పని కోసం ఎక్కడకీ వెళ్లకుండా ఇంటి దగ్గరే సేవలు పొందాలనే సంకల్పంతోనే జగన్ ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు. రేషన్ సైతం ఇంటికే పంపిస్తామని పేర్కొన్నారు. అయితే, పింఛన్ల పంపిణీ ఒక్కటే వాలంటీర్లతో సజావుగా అమలవుతోంది. ఈ వ్యవస్థను తీసుకొచ్చి దాదాపు 10 నెలలు గడుస్తున్నా ఇంకా ఇంటి వద్దకు రేషన్ అమలు కావడంలేదు. ఇప్పటికే ఇది అమల్లోకి వచ్చి ఉంటే ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అది ఎంతగానో ఉపయోగపడేది. కానీ అలా జరగకపోవడంతో ప్రజలకు రేషన్ కష్టాలు తప్పడంలేదు.

అసలే లాక్ డౌన్ నేపథ్యంలో రోజువారీ పనులు చేసేవారికి ఎలాంటి ఆదాయం లేదు. దీంతో ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే రేషన్ సరుకుల కోసం క్యూలో పడిగాపులు పడుతున్నారు. నిజానికి ఈ విపత్కర పరిస్థితుల్లో వాలంటీర్ల సేవలు పలు అంశాల్లో బాగా ఉపయోగపడ్డాయి. ఇంటింటి సర్వే చేయడంలోనూ, క్వారంటైన్ విధించినవారిపై నిఘా పెట్టడంలోనూ, విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించడంలోనూ వారు చక్కని సేవలు అందించారు.

అయితే, రేషన్ పంపిణీకి సంబంధించి చిన్నచిన్న సమస్యలు ఉండటంతో ఆ పని ఇంకా వారికి అప్పగించలేదు. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం రేషన్ పంపిణీని వాలంటీర్ల ద్వారా చేయించాలని ప్రభుత్వానికి సూచించారు. ఇప్పటికైనా సర్కారు దీనిపై దృష్టి సారించి రేషన్ పంపిణీని కూడా ఇంటికే వచ్చేలా చూస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సినిమా

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో,...

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన...

రాజకీయం

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

ఎక్కువ చదివినవి

మహేష్‌ ‘సర్కార్‌ వారి పాట’ పాడనున్నాడా?

గీత గోవిందం చిత్రంతో దర్శకుడిగా సూపర్‌ హిట్‌ అందుకున్న దర్శకుడు పరశురామ్‌ ప్రస్తుతం మహేష్‌బాబుతో సినిమాకు రెడీ అవుతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న వీరిద్దరి కాంబో మూవీ లాక్‌...

మరో స్టార్‌ను బలి తీసుకున్న కరోనా

కరోనా కారణంగా గత రెండు నెలలుగా షూటింగ్స్‌ లేకపోవడంతో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం సినీ కార్మికులు మాత్రమే కాకుండా కొందరు స్టార్స్‌ కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే...

పారిపోయి అందరిని టెన్షన్‌ పెట్టిన కరోనా పాజిటివ్‌ పేషంట్‌

కరోనా ఉందనే అనుమానం ఉంటేనే వారికి ఆమడ దూరంలో ఉండాలని డాక్టర్లు మరియు పోలీసులు సూచిస్తున్నారు. ఎక్కడ కరోనా పేషంట్‌ కనిపించినా కూడా వెంటనే వారిని పట్టుకుని వెళ్లి ఐసోలేషన్‌లో వేస్తున్నారు. వారు...

ఫ్లాష్ న్యూస్: తల్లి శవంను రోడ్డున పడేసిన కొడుకు

వృద్యాప్యంలో తమకు తోడుగా ఉండి, చనిపోయిన సమయంలో దహన సంస్కారాలు చేస్తారనే ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కరు కూడా కొడుకో లేదంటే కూతురు కావాలని కోరుకుంటారు. కాని మంగళగిరికి చెందిన ధనలక్ష్మి అనే అభాగ్యురాలు...

బన్నీ ఈ లాక్‌డౌన్‌ను పాన్‌ ఇండియా మూవీ కోసం వాడేసుకుంటున్నాడుగా..!

అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. సుకుమార్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ తో మైత్రి మూవీస్‌ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంను ఇప్పటికే ప్రారంభించాల్సి ఉన్నా కూడా కరోనా...