Switch to English

త్రివిక్రమ్‌ మరీ అంత కక్కుర్తి పడతాడా?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ తదుపరి చిత్రం కన్ఫర్మ్‌ అయ్యింది. ఆర్‌ఆర్‌ఆర్‌ ముగిసిన వెంటనే ఎన్టీఆర్‌ 30కి త్రివిక్రమ్‌ క్లాప్‌ కొట్టబోతున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. కరోనా కారణంగా కాస్త ఆలస్యంగా సినిమా ప్రారంభం కాబోతుంది. ఆలస్యం అయినా కూడా వచ్చే ఏడాది సమ్మర్‌లోనే సినిమాను విడుదల చేయాలని త్రివిక్రమ్‌ ప్రయత్నాలు చేస్తున్నాడట. ఆ దిశగా స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నట్లుగా మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. కాని గత రెండు రోజులుగా ఎన్టీఆర్‌ 30కి ముందు త్రివిక్రమ్‌ మరో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ ఆగిపోయాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం పూర్తి అయ్యేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని, దాంతో ఆ గ్యాప్‌లో వెంకటేష్‌తో ఒక సినిమాను చుట్టేసేందుకు త్రివిక్రమ్‌ ప్రయత్నాలు చేస్తున్నాడంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నారప్ప పూర్తి అయిన వెంటనే త్రివిక్రమ్‌తో వెంకీ సినిమా ఉంటుందనే పుకార్లు గత రెండు రోజులుగా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు చిరాకును తెప్పిస్తున్నాయి. వెంకీతో మూవీ తర్వాత ఎన్టీఆర్‌ మూవీ అంటే అది సరైన నిర్ణయం కాదంటూ ఫ్యాన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాని అసలు విషయం ఏంటీ అంటే ఎంత సమయం వెయిట్‌ చేసి అయినా త్రివిక్రమ్‌ ఖచ్చితంగా ఎన్టీఆర్‌తోనే సినిమా చేస్తాడు. కొద్ది సమయంలో మరో సినిమా చేసి క్యాష్‌ చేసుకుందాం అనే కక్కుర్తి ఆలోచన త్రివిక్రమ్‌కు ఉండదు. గతంలో పలు సార్లు హీరోల కోసం వెయిట్‌ చేశాడు. ఈసారి కూడా ఎన్టీఆర్‌ కోసం వెయిట్‌ చేస్తాడు. లాక్‌ డౌన్‌ ఎత్తివేస్తే రెండు నెలల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ పూర్తి అవుతుంది. ఆ వెంటనే ఎన్టీఆర్‌ 30 మూవీ ప్రారంభం అవ్వడం ఖాయం. లేని పోని పుకార్లు నమ్మి ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ప్యానిక్‌ కానవసరం లేదు.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, అలాగే రానున్న ఏడాది...

ఫ్లాష్ న్యూస్: యువకుడి ప్రాణాలు తీసిన ప్రేమ వ్యవహారం

ప్రేమ వ్యవహారం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మెదక్ జిల్లా నిజాం పేట మండలం రాంపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తమ అమ్మాయిని ప్రేమ పేరుతో ఇబ్బంది పెడుతున్నారు అంటూ...

లాక్‌డౌన్‌తో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లో వచ్చే మార్పులపై క్లారిటీ

పలు పెద్ద సినిమాలు కరోనా కారణంగా స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయడంతో పాటు షూటింగ్స్‌ను రీ షెడ్యూల్‌ చేయడం మరియు లొకేషన్స్‌ విషయంలో మార్పులు చేర్పులు చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌...

కేజీఎఫ్‌ విషయంలో అంత పట్టుదల ఎందుకు?

కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ప్రపంచంలో పలు దేశాలు లాక్‌ డౌన్‌ అమలు చేశాయి. ఇండియాలో రెండు నెలల పాటు లాక్‌ డౌన్‌ కొనసాగింది. ఇంకా కూడా లాక్‌ డౌన్‌లోనే ఇండియా ఉంది....

చైనా ఆరు రోజుల ఆలస్యం.. ప్రపంచం అల్లకల్లోలం!

ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్న కరోనా వైరస్ కు కారణం ఎవరు అని అడిగితే.. ఠక్కున చైనా అనే సమాధానమే వస్తుంది. కావాలనే సృష్టించారో లేక ప్రపంచం కర్మ కొద్దీ వచ్చిందో అనే విషయాన్ని...