Switch to English

స్పెషల్: పద్మ అవార్డుల్లో అన్యాయంపై టాలీవుడ్‌ మౌనమేల?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

పద్మ అవార్డుల్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఈ ఏడాది అన్యాయం జరిగింది. టాలీవుడ్‌లో ఎవరికీ ఒక్క అవార్డూ రాలేదు. హిందీలో నలుగురు సినిమా ప్రముఖులకు పద్మ అవార్డులు ఇచ్చారు. హీరోయిన్ కంగనా రనౌత్, దర్శకుడు-నిర్మాత కరణ్ జోహార్, నిర్మాత ఏక్తా కపూర్, గాయకుడు అద్నాన్ సమీకి పద్మశ్రీ అవార్డులు ఇచ్చారు. ఆ నలుగురు కంటే గొప్పవారు తెలుగులో ఎంతోమంది ఉన్నారు. ఆ నలుగురి కంటే సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రముఖులు తెలుగులో ఎంతోమంది ఉన్నారు. మరి, తెలుగు సినిమా ప్రముఖులకు అవార్డులు ఎందుకు రాలేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

పద్మ అవార్డు అందుకోవడానికి అర్హత గల హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు, గాయకులూ తెలుగులో లేరా? ఎంతోమంది ఉన్నారు. గాయకుడు అద్నాన్ సమీకి పద్మశ్రీ ఇచ్చారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం ఏం పాపం చేశారు? ఆయన ఎటువంటి రాగంలో అయినా పాడగల ప్రతిభాశాలి. ఎక్కువ పాటలు పాడి గిన్నిస్ బుక్ ఎక్కిన గాయకుడు. ఆరు నేషనల్ అవార్డులు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులు పాతిక అందుకున్నారు. రెట్రో పాటలు ఆయనలా ఇప్పటి గాయకులు ఎవరైనా పాడగలరా? లేదు. ఎస్పీబీ కంటే కచ్చితంగా అద్నాన్ సమీ గొప్ప కాదు. ఆయనకు పద్మశ్రీ రాకుండా అద్నాన్ సమీకి రావడం శోచనీయం.

తెలుగు సినిమా ఇండస్ట్రీ, భారతీయ ఇండస్ట్రీ గర్వించదగ్గ గొప్ప దర్శకుడు దాసరి నారాయణరావు. 150 సినిమాలు తీశారు. ఎంతోమంది ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకొచ్చారు. ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలకు కథలు రాశారు. దర్శకత్వం వహించారు. నిర్మించారు. దర్శకుడిగా, నిర్మాతగా దాసరి కంటే కరణ్ జోహార్ గొప్ప చిత్రాలు తీశాడా? దాసరి కంటే ఎక్కువమంది ప్రతిభావంతులను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాడా? ఈలోకం విడిచి వెళ్లిన తర్వాతనైనా దాసరికి సముచిత గౌరవం ఇవ్వరా? ఈ ఏడాది కొందరు దివంగతులకు పద్మ అవార్డులు ఇచ్చినప్పుడు దాసరికి కూడా ఇస్తే బావుండేది.

అడల్ట్ కంటెంట్ సినిమాలు ‘డర్టీ పిక్చర్’, ‘రాగిణి ఎంఎంఎస్’, ‘లిప్ స్టిక్ అండర్ బుర్ఖా’తో పాటు సీరియల్స్, వెబ్ సిరీస్ లు నిర్మించిన ఏక్తా కపూర్ కి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. ఆమె కంటే గొప్ప చిత్రాలు నిర్మించిన అల్లు అరవింద్ సంగతేంటి? దిల్ రాజు సంగతేంటి? మరికొందరు నిర్మాతల సంగతేంటి? తమ కుటుంబ హీరోలతో మాత్రమే కాకుండా నాని, నాగచైతన్య, విజయ్ దేవరకొండ తదితర హీరోలతో విలువలతో కూడిన కుటుంబ, వినోదాత్మక సినిమాలు అల్లు అరవింద్ నిర్మించారు. ఏక్తా కపూర్ టైపులో అడల్ట్ కంటెంట్ ను నమ్ముకోలేదు. కరణ్ జోహార్, ఏక్తా కపూర్ కంటే దిల్ రాజు ఎక్కువమంది దర్శకులు, సాంకేతిక నిపుణులను వెలుగులోకి తీసుకొచ్చారు.

గత ఏడాది సిరివెన్నెల సీతారామశాస్త్రికి పద్మశ్రీ ఇచ్చారు. సంతోషం. మరి, ఈ ఏడాది ఎందుకో అన్యాయం జరిగింది. దీనిపై టాలీవుడ్ లో ఎవరూ మాట్లాడడం లేదు. ఎందుకో మరి? తెలుగు సినిమా పరిశ్రమ నుండి పద్మ అవార్డులకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రమూ సిఫారసు చేయలేదా? ఒకవేళ చేసినా కేంద్రం కనికరించలేదా? అనేది తెలియదు. కైకాల సత్యనారాయణకు పద్మ అవార్డు రాలేదు. ఆయనలా అర్హత కలిగినవారు తెలుగులో కొందరు ఉన్నారు. వారికి వచ్చేలా మున్ముందు కృషి చేస్తే మంచిది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

ఎక్కువ చదివినవి

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...