హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నా సాయి పల్లవి మాత్రమే ఎందుకు అంత స్పెషల్ అని ఎవరైనా అడిగితే.. ఆమె ఫ్యాన్స్ చెప్పే సమాధానం కచ్చితంగా అందరినీ సర్ ప్రైజ్ చేస్తుందని చెప్పొచ్చు. మామూలుగా ఒక కొత్త అమ్మాయి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే మొదట్లో కాస్త పద్ధతిగా కనిపించినా అవకాశాలు రావట్లేదు అనుకునే టైం లో గ్లామర్ షో చేయడానికి ఓకే అనేస్తారు. ఐతే అలా గ్లామర్ షోకి దూరంగా ఉండి ఛాన్స్ లు వచ్చేలా చేసుకోవడం చాలా కష్టం.
కానీ సాయి పల్లవి మాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా గ్లామర్ షోకి దూరంగా ఉంటుంది. మలయాళ ప్రేమమ్ తో మెప్పించి సౌత్ ఆడియన్స్ కు ఫేవరెట్ అయిన సాయి పల్లవి తెలుగులో ఫిదాతో సూపర్ ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి తన అభిరుచికి తగిన సినిమాలను చేస్తూ ప్రతిభతో మెప్పిస్తూ వస్తుంది.
సినిమాల్లోనే కాదు పబ్లిక్ ఈవెంట్స్ లో కూడా సాయి పల్లవి సంథింగ్ స్పెషల్ అనిపించేలా శారీ లుక్ తో కనిపిస్తుంది. ముందు ఇలానే ఉంటారు తర్వాత తర్వాత గ్లామర్ రోల్స్ కూడా చేస్తారు అనే చాలా మందికి సాయి పల్లవి షాక్ ఇచ్చింది. పాత్రల ఎంపిక, పర్ఫార్మెన్స్ లో ఆమె అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే. పాత్రని పూర్తిగా అర్ధం చేసుకుని దర్శకుడు రాసిన పాత్రకు ఒక రూపం వస్తే ఎలా ఉంటుందో సాయి పల్లవి అలా చేస్తుంది. అందుకే ఆమె గ్లామర్ షో చేయాల్సిన అవసరం లేదు తనలా సినిమాలు చేస్తూ వెళ్తే చాలని ఆమె ఫ్యాన్స్ కూడా కోరుతారు. అందుకే మిగతా హీరోయిన్స్ తో సాయి పల్లవిని పోల్చకుండా ఫిదా సినిమాలో డైలాగ్ లా చెప్పాలంటే సాయి పల్లవి హైబ్రిడ్ పిల్లా ఒక్కతే పీస్ అనేలా తన సత్తా చాటుతుంది అమ్మడు.
